
డిఎస్పీలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన డిజిపి
ఇదే అతిపెద్ద డిఎస్పీ బ్యాచ్ అని కితాబు
గ్రూప్ 1లో ఎంపికైన 115 మంది డీఎస్పీలకు శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. గురువారం డీజీపీ శివధర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ పోలీసు అకాడమీలో డీజీపీ మాట్లాడుతు
115 మందితో ఇదే అతిపెద్ద డీఎస్పీ బ్యాచ్ అని చెప్పారు.
శిక్షణ చాలా కష్టంగా ఉంటుందని, కొత్తగా నియామకమైన డిఎస్పీలు కఠిన శ్రమ చేయాల్సి ఉంటుందని శివధర్ రెడ్డి అన్నారు. అన్ని సవాళ్లను ఎదుర్కొని సమర్థవంతంగా నిలబడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల మనసులు చూరగొనాలని డిజిపి దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో స్నేహపూర్వకంగా ఉంటూ.. ఒకరికి ఒకరు సహకారం అందించుకోవాలని సూచించారు. ఇంటెగ్రిటీ, ఎంపథీ, ప్రొఫెషనల్ ఎక్స్‌లెన్స్.. ఈ మూడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ వంద మంది శిక్షణలోనే కాదు.. బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు.
పోలీసింగ్‌కు ప్రజా సంబంధాలు చాలా ముఖ్యమని ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. డీఎస్పీలుగా చాలా మంది మహిళలు ఉద్యోగాలు సాధించారు. వారు వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలని డిజిపి సూచించారు.టీవల సీఎం రేవంత్‌రెడ్డి గ్రూప్ –1 నియామక పత్రాలు అందించిన విషయం తెలిసిందే. ఇందులో 115 మంది డీఎస్పీలుగా ఎంపికయ్యారు.కొత్తగా ఎంపికైన డీఎస్పీలకు రాజేంద్రనగర్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో పది నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

