
DGP Sivadhar Reddy
కాల్పుల ఘటనపై డిజిపి కీలక విషయాలు
నిందుతుడిపై 22 కేసులు ఉన్నట్టు వెల్లడి
హైదరాబాద్ కాల్పుల ఘటనపై డిజిపి శివధర్ రెడ్డి స్పందించారు. ఈ కేసులో ఆయన ఆదివారం కీలక విషయాలు వెల్లడించారు. చైన్ స్నాచర్లను డిసిపి చైతన్య కుమార్, ఆయన గన్ మెన్ మూర్తి 750 మీటర్ల దూరం వరకు వెంబడించారని, ఈ క్రమంలోనే నిందితుడు సయ్యద్ ఒమర్ అన్సారీ కత్తితో దాడి చేసినట్లు డిజిపి తెలిపారు. ఒమర్ పై కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ కూడా ఉందని, అతనిపై 22 కేసులు ఉన్నాయని డిజిపి తెలిపారు. డిసిపి , గన్ మెన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, నిందితుడు ఒమర్ కు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగినట్టు డిజిపి వెల్లడించారు. అతని ఆరోగ్యం కూడా నిలకడగా ఉందన్నారు.
Next Story

