ఓటీటీలోకి ధురంధర్.. ఎప్పటి నుంచి అంటే?
x

ఓటీటీలోకి 'ధురంధర్'.. ఎప్పటి నుంచి అంటే?

రికార్డు స్థాయి ధరకు ఓటీటీ డీల్!


రణవీర్ సింగ్, అదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. థియేటర్లలో రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ డీల్ దాదాపు రూ. 285 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం, ఇది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక రికార్డ్.

స్ట్రీమింగ్ వివరాలు:

ఓటీటీ ప్లాట్‌ఫారమ్: నెట్‌ఫ్లిక్స్

రిలీజ్ డేట్ : ఈ సినిమా జనవరి 30, 2026 నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

భాషలు: హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

సినిమా విశేషాలు:

రణవీర్ సింగ్ ఒక శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్ , అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటించారు. థియేటర్లలో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

* * *

Read More
Next Story