బర్త్ డే విషెస్ చెప్పలేదని ఎంఎల్ఏ రాజాసింగ్ అలిగారా ?
x
BJP MLA Raja Singh

బర్త్ డే విషెస్ చెప్పలేదని ఎంఎల్ఏ రాజాసింగ్ అలిగారా ?

గోషామహల్ బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ పదవీకాలం ఐదేళ్ళూ కోపాలతోను అలకలతోనే సరిపోయేట్లుంది.


గోషామహల్ బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ పదవీకాలం ఐదేళ్ళూ కోపాలతోను అలకలతోనే సరిపోయేట్లుంది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ఎంఎల్ఏ అనిపించుకున్న రాజాసింగ్ ఏడాదిన్నరలో ఎక్కువ కాలం అలకలు, కోపాలతోనే సరిపోయింది. ఇపుడు విషయం ఏమిటంటే రాజాసింగ్ 1977, ఏప్రిల్ 15వ తేదీన పుట్టాడు. సో, పుట్టినరోజు సందర్భంగా మూడురోజుల క్రితం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాడు. అలాగే ఎంఎల్ఏ అభిమానులు, శ్రేయోభిలాషులు చాలామంది ఫోన్లుచేసి, నేరుగా వచ్చి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అయితే పార్టీ అధ్యక్షుడితో పాటు చాలామంది సీనియర్లు, ప్రజాప్రతినిధులు ఎంఎల్ఏకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదని సమాచారం. అందుకని అలిగిన ఎంఎల్ఏ శుక్రవారం జరిగిన కీలకమైన సమావేశానికి డుమ్మాకొట్టారు.

ఒక ప్రైవేటు హోటల్లో బీజేపీ(BJP)కి చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో కేంద్రమంత్రి, తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) సమావేశం నిర్వహించారు. ఈనెలాఖరులో హైదరాబాద్(Hyderabad) జిల్లా స్ధానికసంస్ధల ఎంఎల్సీ ఎన్నిక జరగబోతోంది. బీజేపీ తరపున గౌతమ్ రావు పోటీచేస్తున్నారు. అభ్యర్ధి గెలుపు విషయంలో కిషన్ నిర్వహించిన కీలకమైన సమావేశానికి ఎంఎల్ఏ గైర్హాజరయ్యారు. గౌతమ్ రావు అభ్యర్ధిత్వాన్ని ఎంఎల్ఏ తీవ్రంగా వ్యతిరేకించారు. కారణం ఏమిటని నేతలు మాట్లాడుకున్నపుడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవటంతోనే రాజాసింగ్ అలిగారన్న విషయం బయటపడింది.

ఈమధ్యే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండిసంజయ్ ఓల్డ్ సిటీకి వెళ్ళి రాజాసింగ్(BJP MLA Raja Singh) ను కలిసి బుజ్జగించారు. ఎందుకు బుజ్జగించాల్సొచ్చిందంటే పార్టీ నాయకత్వంమీద అలిగిన ఎంఎల్ఏ చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కేంద్రంనుండి ఎంతపెద్ద స్ధాయి నేతలొచ్చినా, కేంద్రమంత్రులొచ్చినా సరే రాజాసింగ్ మాత్రం ఎవరినీ కలవటంలేదు. పైగా పార్టీలో జరిగే డెవలప్మెంట్లమీద బహిరంగంగా ఆరోపణలు, విమర్శలతో నానా ఇబ్బంది పెడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈమధ్య ఎంఎల్ఏతో బండి(Bandi Sanjay) భేటీ అయి బుజ్జగించింది.

బండి బుజ్జగింపులతో ఎంఎల్ఏ యాక్టివ్ అయి ఎంఎల్సీ అభ్యర్ధి గెలుపుకు పనిచేస్తారని అనుకుంటే కథ మళ్ళీ మొదటికి వచ్చిందని సీనియర్లు ఇపుడు తలలు పట్టుకుంటున్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదని కూడా ఎంఎల్ఏ అలుగుతారా అని పార్టీ నేతలు హాశ్చర్యంగా చెప్పుకుంటున్నారు.

Read More
Next Story