
కేసీఆర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యే భేటీ..!
ఫిరాయింపు నేతలు విషయంలో స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన క్రమంలో కేసీఆర్, మహిపాల్ రెడ్డి భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.
మాజీ సీఎం, బీఆర్ అధ్యక్షుడు కేసీఆర్.. అసెంబ్లీ లాబీలో ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. ఫిరాయింపు నేతలు విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంత సమయం కావాలో తెలపాలంటూ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన క్రమంలో కేసీఆర్, మహిపాల్ రెడ్డి భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. మళ్ళీ బీఆర్ఎస్ జెండా పట్టుకోవాలని, బీఆర్ఎస్‌లోకి రావాలని ఆయన కోరారంటూ ప్రచారం మొదలైంది. ఫిరాయింపులను సుప్రీంకోర్టు ఫోకస్ పెట్టడంతో మహిపాల్ రెడ్డి ప్లేట్ ఫిరాయించారన్న టాక్ మొదలైంది. అయితే కేసీఆర్‌ను కలవడానికి పొలికల్ రీజన్స్ ఏమీ లేదని మహిపాల్ రెడ్డి అనుచరులు తెలిపారు. తన తమ్ముడి కొడుకు పెళ్లికి ఆహ్వానించడం కోసమే మహిపాల్ రెడ్డి.. కేసీఆర్‌ను కలిశారని స్పష్టం చేశారు. ఈ మేరకు పెళ్ళి ఆహ్వాన పత్రిక అందించారని, ఆ మేరకు కేసీఆర్ కలిసి మాట్లాడారని చెప్పారు.
Next Story