ఐటీ ఆఫీసుకు దిల్ రాజు..
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మంగళవారం ఐటీ ఆఫీసుకు చేరుకున్నారు. పలు కీలక పత్రాలతో ఆయన ఐటీ కార్యాలయం వెళ్లడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మంగళవారం ఐటీ ఆఫీసుకు చేరుకున్నారు. పలు కీలక పత్రాలతో ఆయన ఐటీ కార్యాలయం వెళ్లడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇటీవల దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. నాలుగు రోజుల పాటు వారి తనిఖీలు కొనసాగాయి. దిల్ రాజు సహా మైత్రీ మూవీమేకర్స్ సంస్థ, పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ ఇంట కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఈ సోదాలకు సంబంధించే విచారణకు రావాల్సిందిగా అధికారులు కోరడంతో పలు డాక్యుమెంట్స్ తీసుకుని దిల్ రాజు.. ఐటీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే వారం క్రితం సినిమా పెట్టుబడులు, వస్తున్న రిటర్న్స్, వారు కడుతున్న ట్యాక్స్‌లకు సంబంధించే అధికారులు సోదాలు చేశారు. వారి కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఈ తనిఖీలు కొనసాగాయి. ఈ సోదాలు అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంకు వివరాలు, ఐదే సంవత్సార పాటు చెల్లించిన వారి ఆదాయ పన్ను వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లతో విచారణకు రావాలని అధికారులకు నోటీసుల్లో పేర్కొన్నారు. 2023 నుంచి 2025 వరకు సినీ నిర్మాణానికి సంబంధించి పెట్టిన పెట్టుబడులు, వచ్చిన ఆదాయాలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకురావాలని ఆదేశించారు అధికారులు. ఐటీ విచారణ తర్వాత దిల్ రాజు.. మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.