హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా విమాన సర్వీసులు
x

హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా విమాన సర్వీసులు

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్ కు నేరుగా వారానికి నాలుగు విమాన సర్వీసులు నడిపేందుకు సోమవారం శ్రీకారం చుట్టారు.


హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి థాయ్ ఎయిర్ ఏషియాతో కలిసి విమాన సర్వీసులు ప్రారంభించింది.

- మలేషియన్ ఎయిర్ ఏషియా, థాయ్‌లాండ్ ఆసియా ఏవియేషన్ జాయింట్ వెంచర్ దేశీయ,అంతర్జాతీయ విమానాలను అందిస్తోంది.ఈ నాన్‌స్టాప్ విమాన సర్వీసులు ప్రతి సోమవారం, బుధ, శుక్ర, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కి నాలుగు కొత్త విమాన సర్వీసులను నడిపేందుకు శ్రీకారం చుట్టింది.
- ఈ కొత్త విమాన సర్వీసులు విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తాయని జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ పనికర్ చెప్పారు. ఈ కొత్త విమాన సర్వీసులతో హైదరాబాద్, బ్యాంకాక్ మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు బలోపేతం కానున్నాయి.బడ్జెట్ క్యారియర్ అయిన థాయ్ ఎయిర్ ఏషియా నుంచి ప్రయాణికులకు మరింత సరసమైన, సౌకర్యవంతమైన విమాన ప్రయాణం అందిస్తోంది.



హైదరాబాద్- బ్యాంకాక్ నగరాల మధ్య ప్రయాణాన్ని పెంచడం వల్ల పర్యాటకం, వ్యాపార రంగం బలోపేతం కానుంది.దేశంలోని ప్రధాన మెట్రో నగరాలకు తన నెట్‌వర్క్‌ని విస్తరించే అవకాశం కోసం ఎయిర్‌ఏషియా చాలా కాలంగా ఎదురుచూస్తోందని థాయ్‌ ఎయిర్‌ఏషియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శాంటిసుక్‌ క్లోంగ్‌చయ్య చెప్పారు.ప్రస్థుతం థాయ్ ఎయిర్‌ఏషియా భారత దేశంలోని 12 నగరాలైన కోల్‌కతా, చెన్నై, జైపూర్, కొచ్చి, బెంగుళూరు, గయా, లక్నో, అహ్మదాబాద్, గౌహతి, విశాఖపట్నం, తిరుచిరాపల్లి,హైదరాబాద్, లకు వారానికి 67 విమానాలను నడుపుతోంది.బ్యాంకాక్‌ను ఆహార ప్రియులకు స్వర్గధామంగా మారింది.



Read More
Next Story