బీఆర్ఎస్ కి హైకోర్టులో మళ్ళీ నిరాశే...
x

బీఆర్ఎస్ కి హైకోర్టులో మళ్ళీ నిరాశే...

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు వేసిన పిటిషన్ పై గురువారం తెలంగాణ హై కోర్టు విచారణ జరిపింది.


పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు వేసిన పిటిషన్ పై గురువారం తెలంగాణ హై కోర్టు విచారణ జరిపింది. బీఆర్ఎస్ బీఫార్మ్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు కోర్టు మెట్లెక్కారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ లో డిమాండ్ చేశారు.

ఈ పిటిషన్ పై నేడు హై కోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను జులై 15 కి వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్ ని కోరినప్పటికీ, ఆయన చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే వివేకానంద హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన చర్యలు తీసుకోలేదని, కోర్టు స్పందించి ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకునేలా చేయాలని పిటిషన్ లో కోరారు.

కాంగ్రెస్ గూటికి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు...

కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

శుక్రవారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈయన గతంలో రెండు సార్లు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అప్పుడే పార్టీ ఫిరాయిస్తారని వార్తలు వచ్చాయి. అందునా రేవంత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ మంచి స్నేహితులు. గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన రేవంత్ రెడ్డిని రెండుసార్లు కలవడం అనుమానాలకు తావిచ్చింది. కేటీఆర్ రంగంలోకి దిగి నచ్చజెప్పడంతో తాత్కాలికంగా పార్టీ మార్పుని విరమించుకున్నారని, రేపు కాంగ్రెస్ లో చేరడం పక్కా ని ప్రచారం జరుగుతోంది.

Read More
Next Story