Deputy CM Bhatti Vikramarka
x

సివిల్స్ అభ్యర్ధులకు అన్ని విధాలా సాయం

‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ పథకం కింద మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష చెక్కుల పంపిణీ


సివిల్స్‌ అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సాయం అందించడానికి సిద్ధంగా ఉందని తలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విర్కమార్క హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ పథకం కింద సివిల్స్‌-2025లో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష చెక్కులను మంత్రి కోమటిరెడ్డితో కలిసి భట్టి పంపిణీ చేశారు. రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకం ద్వారా అభ్యర్థులకు ప్రభుత్వం సాయం అందిస్తోందని తెలిపారు. ఈ పథకాన్ని విజయవంతంగా రెండో సంవత్సరం అమలుచేస్తున్నామన్నారు.సివిల్స్ కు ప్రిపేరయ్యే పేద విద్యార్ధులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు.ఈ సందర్భంగా సివిల్స్‌-2024 విజేతలకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

Read More
Next Story