రేవంత్‌తో డీఎంకే నేతలు భేటీ
x

రేవంత్‌తో డీఎంకే నేతలు భేటీ

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా మార్చి 22న చెన్నైలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. అందులో పాల్గొనాలని సీఎం రేవంత్‌ను ఆహ్వానించారు తమిళనాడు డీఎంకే నేతలు.


గురువారం తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని ఢిల్లీలో కలిశారు. ఈనెల 22న చెన్నైలో డీలిమిటేషన్ అంశంపై జరగనున్న సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు.

డీలిమిటేషన్‌ (Delimiatation) కు వ్యతిరేకంగా మార్చి 22న చెన్నైలో జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) ఏర్పాటు చేస్తున్నామని అందులో తప్పకుండా పాల్గొనాలని సీఎం రేవంత్‌ను వారు ఆహ్వానించారు తమిళనాడు డీఎంకే నేతలు.

తమిళనాడు బృందంలో డిఎంకె నేతలు కేఎన్ నెహ్రూ, ఎంపీ ఎన్ఆర్ ఇలాంగో, ఎంపీ కమిమోళి, కేంద్రమాజీ మంత్రి రాజా తదితరులు ఉన్నారు. ఈ సమావేశంలో డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టంపై చర్చించారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి ఈ సమావేశానికి రావాలని వారు కోరారు. కాగా పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత తాను ఈ సమావేశానికి హాజరవుతానని రేవంత్ చెప్పారు.

కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్ ప్రణాళికలు దక్షిణాది రాష్ట్రల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ప్రణాళికలను ఆచరిస్తే అత్యధికంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలేనని సదరు రాష్ట్రాల సీఎంలు అంటున్నారు. అందుకే కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్ ప్రణాళికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం చెప్పిందంటే కుటుంబ నియంత్రణు ఈ రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేశాయని, ఇప్పుడు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునరుద్దరణ చేస్తామంటే.. నష్టపోయేది ఈ రాష్ట్రాలేనని దక్షిణాధి రాష్ట్రాల సిఎంలు తమ వాయిస్ వినిపిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ తమ వాయిస్ వినిపించారు.

తాము ఈ ప్రణాళికలను తీవ్రంగా ఖండిస్తున్నామని, జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునరుద్దరణ చేయాలంటే దీనిని మరో 30ఏళ్లు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై కక్షపూరిత చర్యగానే కేంద్రం డీలిమిటేషన్ ప్రణాళికలు సిద్ధం చేసిందని కూడా సీఎం రేవంత్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ చర్చజరుగుతుంది. దక్షిణాదిలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు ఏకం కావాలన్న నినాదం వినిపిస్తోంది. ఈ క్రమంలోనే డిఎంకె నేతలు హైదరాబాద్ కు వచ్చారు.

ఈ సమావేశంలో డీలిమిటేషన్ ప్రక్రియపై అమలు అనేది ఏ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలన్నదే ఈ సమావేశ ప్రధాన అజెండాగా చెప్పినట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ పేరిట దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు తీసుకుంటామని సీఎం రేవంత్ వివరించారు. అంతేకాకుండా తమిళనాడు కన్నా ముందే డీలిమిటేషన్‌పై తమిళనాడులో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ అనేది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన అంశమని రేవంత్ చెప్పారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల్లోని బీజేపీ కూడా భాగం అవుతుందని, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాదికి జరుగుతున్న నష్టం గురించి రాజకీయాలకు అతీతంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

కాగా ఈనెల 22న చెన్నైలో నిర్వహించనున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో దక్షినాది రాష్ట్రాలయిన తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ప్రాంతాల ప్రగతికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం కీలక అంశంగా మారనుంది. డీలిమిటేషన్ వల్ల వచ్చే రాజకీయ పరిణామాలు, రాష్ట్రాల మధ్య సంబంధాలు, వాస్తవాలపై చర్చలు జరగనున్నాయి. డీలిమిటేషన్ అనేది ప్రజల హక్కులను హరించేలా ఉండకూడదని డీఎంకే నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్‌కు సంబంధించి తీసుకునే నిర్ణయాలు అన్ని రాష్ట్రాల ప్రజలకు అనుగుణంగా ఉంటాయని, ప్రజల హక్కులను కాపాడేలా ఉంటాయిన వారు చెప్పారు. ఈ సమావేవంలో ప్రతి రాష్ట్రం వారు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు.

Read More
Next Story