మోడీని బహిష్కరించిన వన్ వాటు దేశం గురించి తెలుసా ?
x
Vanuatu Island Country

మోడీని బహిష్కరించిన వన్ వాటు దేశం గురించి తెలుసా ?

ప్రధానమంత్రి జోథం నపాట్ చేసిన ప్రకటనతో లలిత్ మోడీ వన్ వాట దేశంలో ఉన్నాడని తెలిసింది. దాంతో నెటిజన్లకు వన్ వాటు దేశంగురించి తెలుసుకోవాలన్న ఆశక్తి పెరిగింది.


ఒక్కసారిగా మనజనాలు వనాటు దేశం గురించి ఇపుడు విపరీతంగా వెతికేస్తున్నారు. అసలింతకీ వన్ వాటు(Vanuatu) అనే దేశం ఉందన్న విషయం కూడా మనలో చాలామందికి తెలీదు. అయినా ఇపుడు ఈ దేశంగురించి ఎందుకింతగా ఆశక్తి పెరిగిపోయింది ? ఎందుకంటే ఈరోజు మీడియాలో ఒక వార్త ప్రముఖంగా వచ్చింది. అదేమిటంటే తమ దేశంనుండి ఆర్ధిక నేరగాడు లలిత్ మోడీ(Lalit Modi)ని బహిష్కరిస్తున్నట్లు వన్ వాటు ప్రధానమంత్రి(Jotham Napat) జోథం నపాట్ ప్రకటించారు. అంతేకాకుండా గతంలో మోడీకి జారీచేసిన పాస్ పోర్టును కూడా అర్జంటుగా రద్దుచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. లలిత్ మోడీ ఎంతకాలంగా వనాటులో ఉంటున్నారన్న విషయం తెలీదు. అయితే ఇంతకాలానికి మోడీలాంటి ఆర్ధిక నేరగాళ్ళకు తమదేశంలో చోటులేదని సడెన్ గా ప్రధానమంత్రి ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ వనాటు దేశం, జోథం నపాట్ అప్రస్తుతం. మనకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే లలిత్ మోడీనే. ఐపీఎల్ క్రికెట్(IPL Cricket) ఛైర్మన్ గా చాలా కాలం పనిచేయటంతో లలిత్ మోడీ అంటే దేశంలో చాలామందికి బాగా తెలుసు.

వేలకోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడి ఒక్కసారిగా జెండాఎత్తేసి దేశం విడిచిపోరిపోయాడు. వేల కోట్ల రూపాయలను అక్రమంగా విదేశాలకు తరలించేసిన మోడీ సడెన్ గా దేశంవిడిచి పారిపోయాడు. అప్పటినుండి విదేశాలకు పారిపోయిన ఆర్ధిక నేరగాళ్ళ కోసం వెతుకుతున్నట్లే మనదేశం ఈ మోడీగురించి కూడా వెతుకుతోంది. వెతుకుతోంది అంటే మోడీ ఎక్కడున్నాడో పసిగట్టింది. అయితే తానుంటున్న దేశం నుండి ఇండియాకు రప్పించాలంటే తల ప్రాణం తోకలోకి వచ్చేస్తుందన్నట్లుగా తయారైంది వ్యవహారం. మొహిల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయామాల్య(Vijayamalya) లాంటి ఆర్ధిక నేరగాళ్ళ(Financial Fraudsters) ను భారత్(Bharat) కు రప్పించేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కేంద్రప్రభుత్వం వల్ల కావటంలేదు. అంతెందుకు కేసీఆర్(KCR) హయంలో తప్పుడుమార్గాల్లో వేలాది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్(Telephone Tapping) చేయించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టీ ప్రభకరరావును అమెరికా నుండి రప్పించటమే మన వాళ్ళవల్ల కావటంలేదు. ఇక ఆర్ధిక నేరగాళ్ళను, ఉగ్రవాదులను రప్పించటం అంత సులభంగా అవుతుందా ?

దేశంలో అక్రమాలకు ఎలా పాల్పడాలి ? ఏ విధంగా తప్పించుకోవాలి ? ఎక్కడ దాక్కోవాలి అన్న విషయాలను ముందుగా ఆర్ధికనేరగాళ్ళు బాగా స్టడీచేసిన తర్వాతే ఇండియాలో తమ పని మొదలుపెడతారు. అలాగే లలిత్ కూడా ముందు ఇంగ్లాడ్, అమెరికాలకు పారిపోయినా ఆ తర్వాత ఆయన జాడ పెద్దగా తెలీలేదు. ప్రధానమంత్రి జోథం నపాట్ చేసిన ప్రకటనతో లలిత్ మోడీ వనాటు దేశంలో ఉన్నాడని తెలిసింది. అందుకనే నెటిజన్లకు ఒక్కసారిగా వనాటు దేశంగురించి తెలుసుకోవాలన్న ఆశక్తి పెరిగినట్లుంది.

ఇంతకీ వనాటు దేశం ఎక్కడుంది ?

ఈ దేశం ఎక్కడుంది అంటే ఉత్తర ఆస్ట్రేలియా(Australia)కు 1750 కిలోమీటర్ల దూరంలో దక్షిణ పసిఫిక్ సహాసముద్రంలో ఉంది. ఇదొక ద్వీపదేశం. మొత్తం 83 ద్వీపాల సమాహారం. ఉండటానికి 83 ద్వీపాలున్నా 65 ద్వీపాలు మాత్రమే నివానికి పనికొస్తాయి. మిగిలిన ద్వీపాల్లో అగ్నిపర్వాలు చాలా ఎక్కువ. ఏపర్వతం ఎప్పుడు పేలుతుందో తెలీదు కాబట్టి జనాలు నివసించరు. Y ఆకారంలో ఉండే ఈ దేశానికి రాజధాని పోర్టువిల్లా నగరం. రాజధాని నగరం ఎఫేట్ ఐల్యాండులో ఉంది. పశ్చిమంగా ఫిజీ(Fiji Islands) దేశంతో పాటు సాలమాన్ ద్వీపాలు, న్యూ కాలేడోనియా ద్వీపాలున్నాయి. ఈ ద్వీపాలకు సుమారు 3 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ద్వీపదేశాన్ని మొదట 1606 సంవత్సరంలో పోర్చుగీసు నావికుడు ఫెర్నాండెజ్ డి క్వీరోస్ కనిపెట్టాడు. కనిపెట్టింది పోర్చుగీసు నావికుడు పెర్నాండెజే అయినా వివిధ కారణాలతో దీన్ని స్పెయిన్ దేశానికి సొంతమని ప్రకటించాడు. అప్పటినుండి చాలాకాలం ఈ ద్వీపదేశం స్పెయిన్ ఆధీనంలోనే ఉండేది. అయితే ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఈ ద్వీప దేశంపై కన్నెశాయి. దాంతో పైరెండు దేశాల ఒత్తిడికి తట్టుకోలేక స్పెయిన్ వనాటు(వనౌటు)ను వదిలేసింది.

1880 నుండి ఈ ద్వీపదేశం ఫ్రాన్స్, బ్రిటన్ సంయుక్త పాలనలోనే ఉంది. రకరకాల కారణాలతో దేశప్రజల్లో స్వాతంత్ర్యకాంక్ష పెరిగిపోయింది. దాంతో పోరాటాలు, అంతర్యుద్ధాలు మొదలయ్యాయి. దశాబ్దాలపాటు జరిగిన పోరాటాల ఫలితంగా చివరకు 1980లో వనాటుకు స్వాతంత్ర్యం లభించింది. వనాటు జనాభా సుమారు 5 లక్షలు. జనాభాలో ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడతారు. ఈ దేశఆర్ధిక ప్రగతికి టూరిజం, సముద్రపు ఉత్సత్తుల ఎగుమతులే కీలకం. ఇదే సమయంలో ఈ దేశం ‘ట్యాక్స్ హెవెన్’(Tax Heaven) దేశం అని కూడా ప్రచారంలో ఉంది. అందుకనే ఇంత బుల్లిదేశంలో అంతర్జాతీయ బ్యాంకులు చాలానే ఉన్నాయి.

పన్నులు లేవు

ఈ దేశంలో ఎలాంటి పన్నులు ఉండవు. ఈ దేశంలోని జనాభాకు ఆదాయపు పన్నులు, వ్యాపారాల మీద పన్నులు, మూలధన లాభాల పన్నులు, వారసత్వపు పన్నులు లాంటివి ఏవీ ఉండవు. అందుకనే ఈ దేశం ఆర్ధిక నేరగాళ్ళకు స్వర్గధామంగా ప్రచారంలో ఉంది. ప్రపంచ దేశాల్లోని ఎక్కడెక్కడి ఆర్ధికనేరగాళ్ళు వనాటు పౌరసత్వాన్ని తీసుకుని హ్యాపీగా జీవితాన్ని గడేస్తున్నారు. ఈ దేశంలో ఆర్ధిక అక్రమాలు కొత్తేమీకావు. 2001 నుండి పాలకులపై ఏవో ఆర్ధిక ఆరోపణలు వినబడుతునే ఉన్నాయి. అందుకనే ఈదేశంపై అంతర్జాతీయ ఆర్ధిక నియంత్రణ సంస్ధలు గట్టిగా కన్నేసుంచాయి. అలాగే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎప్ఏటీఎఫ్) వనాటును గ్రే లిస్ట్ లో ఉంచింది. ఇదే సమయంలో మనదేశంలో 2017లో సంచలనం సృష్టించిన ‘ప్యారడైజ్ పేపర్స్’ లీక్స్ వల్ల వనాటు దేశంపై అంతర్జాతీయ దృష్టిపడింది. అనేక కారణాలతో వనాటులో అంతర్జాతీయ బ్యాంకులు మూతపడినా ఇంకా దేశంపై ట్యాక్స్ హెవెన్ అనే ముద్రయితే పోలేదు. అందుకనే లలిత్ మోడీ లాంటి ఆర్ధిక నేరగాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు.

మరిపుడు మోడీ ఏంచేస్తాడు ?

తాజా పరిణామాల్లో లలిత్ మోడీని వనాటు నుండి బహిష్కరించటం ఖాయమని అర్ధమైంది. వనాటు నుండి బయటకు వెళ్ళాల్సిన పరిస్ధితి వచ్చింది కాబట్టి ఇపుడు లలిత్ మోడీ ఏమిచేస్తాడు ? చేసేదేముంది ట్యాక్స్ హెవెన్ లాంటి మరోదేశంలోకి మారుతాడు. ఎందుకంటే చేతిలో వేలకోట్ల రూపాయలుంది. ఆ వేలకోట్ల రూపాయలను ఎక్కడో పెట్టుబడులుగా పెట్టుంటాడు. పైగా వనాటు లాంటి ట్యాక్స్ హెవెన్ దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. వెళ్ళటానికి ఏ దేశమూ సాధ్యంకాకపోతే తానే ఏదో ఒక దీవినో లేకపోతే ద్వీపాన్నో నిత్యానంద(Nityananda) లాగే కొనేసినా కొనేయచ్చు. అదే జరిగితే లలిత్ మోడీయే ఆ ద్వీపమో లేకపోతే దీవికో అధ్యక్షుడు కమ్ సోల్ ప్రొప్రయిటర్ అయిపోతాడు. కాబట్టి తనను ఇక బహిష్కరించటం అన్నమాటే ఉండదు. చేతిలోని డబ్బుతో టూరిజం, మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేస్తే ప్రపంచలోని జనాలు పోలోమంటు వాలిపోతారు. లలిత్ మోడీ సామర్ధ్యంగురించి తెలుసు కాబట్టే జనాలు ఇపుడు వనాటు దేశం గురించి నెటిజన్లు తెగవెతికేస్తున్నారు.

Read More
Next Story