హైదరాబాద్ లో ఇంతమంది బిలియనీర్లున్నారా ?
x
Billionaires in Hyderabad

హైదరాబాద్ లో ఇంతమంది బిలియనీర్లున్నారా ?

వెయ్యికోట్ల రూపాయల నికరసంపద ఉన్నవారు హైదరాబాద్ లో 122 మంది ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది.


మన సమాజంలో పేదలు మరింత పేదలుగా మారిపోతుంటే సంపన్నులు మరింత సంపన్నులు అయిపోతున్నారు. సంపన్నులు మరింత సంపన్నులుగా మారిపోవటానికి అనేక కారణాలున్నాయి. ఇపుడిదంతా ఎందుకంటే దేశంలోని సంపన్నుల జాబితాను హురూన్ ఇండియా-రిచ్ లిస్ట్ 2024 విడుదలైంది. ఈ జాబితాలో భాగ్యనగరం అలియాస్ హైదరాబాద్ పేరు ప్రముఖంగా వినబడుతోంది. కారణం ఏమిటంటే రిచ్ లిస్ట్-2024 జాబితాలో హైదరాబాద్ పేరు మూడో స్ధానంలో నిలబడింది. మొదటిస్ధానంలో ఢిల్లీ, రెండోప్లేసులో ముంబాయ్ ఉంటే మన హైదరాబాద్ స్ధానం మూడు.

జాబితా ప్రకారం భాగ్యనగరంలో బిలియనీర్లు 18 మంది ఉంటే అత్యంత సంపన్నులు 104 మంది ఉన్నారు. బిలియనీర్లకు అత్యంత సంపన్నులకు మధ్య తేడా ఉంది. అదేమిటంటే బిలియనీర్లంటే 100 కోట్ల డాలర్ల సంపదను దాటినవారు. అత్యంత సంపన్నులంటే 100 కోట్ల డాలర్లకన్నా తక్కువున్నవారు. దీని ప్రకారం 18 మంది నికర సంపద మన కరెన్సీలో తలా రు. 8388 కోట్లు. మిగిలిన 104 మంది అత్యంత సంపన్నుల నికర సంపద తలా రు. వెయ్యికోట్ల రూపాయల పైమాటే. మొన్నటివరకు మూడోప్లేసులో నిలిచిన బెంగుళూరును వెనక్కునెట్టి హైదరాబాద్ ఆ ప్లేసులో నిలబడింది. దివీస్ ల్యాబరేటరీస్ అధినేత మురళి దివి బిలియనీర్లలో మొదటిస్ధానంలో ఉన్నారు. మురళీ దివి నికర సంపద రు. 76,100 కోట్లు.

రెండో ప్లేసులో రు. 54,200 కోట్లతో పీ. పిచ్చిరెడ్డి, మూడోప్లేసులో రు. 52, 700 కోట్లతో పీవీ కృష్ణారెడ్డి, నాలుగో ప్లేసులో రు. 29,900 కోట్లతో బీ పార్ధసారధిరెడ్డి ఉన్నారు. బిలియనీర్ల నికరసంపద అంటే ముఖ్యంగా వారి వ్యాపారాల షేర్ మార్కెట్ విలువనే చెప్పాలి. అలాగే వాళ్ళ ఆస్తుల విలువను కూడా లెక్కవేస్తారు. అన్నింటినీ కలిపి నికరసంపద ఎంత అన్నది హురూన్ వాచ్ లిస్టు మదింపుచేస్తుంది. రిచ్ లిస్ట్ పేరుతో ప్రతిఏడాది బిలియనీర్ల జాబితాను హురూన్ ప్రకటిస్తుంటుంది. వెయ్యికోట్ల రూపాయల నికరసంపద ఉన్నవారు హైదరాబాద్ లో 122 మంది ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది.

ఇక దేశంమొత్తంమీద తీసుకుంటే మొదటిస్ధానంలో రు. 11.60 లక్షల కోట్ల నికరసంపదతో గౌతమ్ అదాని నిలిచారు. రెండోస్ధానంలో రు. 10.14 లక్షల కోట్లతో రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబాని నిలిచారు. మూడోస్ధానంలో రు. 3.14 లక్షల కోట్లతో హెచ్సీఎల్ కంపెనీ యాజమాని శివనాడార్ నిలిచారు. అలాగే సినిమాఫీల్డుకు సంబంధించి అత్యంత సంపన్నుడుగా రు. 7,300 కోట్లతో షారుక్ ఖాన్ నిలిచారు. రెండో ప్లేసులో రు. 4600 కోట్లతో షారుఖ్ వ్యాపార భాగస్వామి, సీనియర్ నటి జూహీ చావ్లా నిలిచారు. మొత్తానికి ఏ రంగంలో తీసుకున్నా మన హైదరాబాద్ తన సత్తాను చాటుతోంది.

Read More
Next Story