
జైల్లో రేవంత్ ను ఎన్ని హింసలు పెట్టారో తెలుసా ?
శారీరకంగా కాకపోయినా మానసికంగా తనను హింసలు పెట్టారని స్వయంగా చెబితే నమ్మకుండా ఎలా ఉండగలము ?
ఒక ఎంపీని కరడుగట్టిన తీవ్రవాదులను, మావోయిస్టులను చిత్రహింసలు పెట్టినట్లుగా జైల్లో హింసలు పెడతారా ? ఏమో ఇప్పటివరకు ఒక ఎంపీని ఇంతగా హింసలుపెట్టినట్లు వినలేదు. కాని శారీరకంగా కాకపోయినా మానసికంగా తనను హింసలు పెట్టారని స్వయంగా చెబితే నమ్మకుండా ఎలా ఉండగలము ? ఇంతకీ విషయం ఏమిటంటే బీఆర్ఎస్ హయంలో రేవంత్(Revanth) ను పోలీసులు అరెస్టుచేసి కోర్టుద్వారా జైల్లో పెట్టారు. 16 రోజులు చర్లపల్లి జైలు(Charpalli Jail)లో 7 అడుగులు మాత్రమే పొడవుండే జైలులో ఉంచారట. జైలులోని ఒక బ్యారక్ లో కార్నర్ గదిలో ఉంచి హింసించినట్లు అసెంబ్లీలో స్వయంగా రేవంతే చెప్పాడు.
తనను బంధించిన గదులకు పక్కగదుల్లో ఖైదీలను ఎవరినీ ఉంచలేదన్నారు. ఎందుకంటే తాను మరో ఖైదీని చూడకూడదని, తనతో ఎవరూ మాట్లాడకూడదని బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఆపనిచేసినట్లు చెప్పాడు. తాను ఉన్న గదిలో రాత్రిపూట లైట్ వెలుగుతునే ఉండేట్లుగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పాడు. లైటు వెలుగుతుంటే నిద్రపట్టడంలేదు లైట్ ఆపమంటే కుదరదని సెంట్రీ చెప్పాడట. ఎందుకనంటే పై నుండి ఆర్డర్లు రావటంతోనే లైట్లు రాత్రంతా వేసుంచుతున్నట్లు సెంట్రీ బదులిచ్చాడని రేవంత్ చెప్పాడు. తనను జైలులో ఐఎస్ఐ(ISI Terrorists) ఖైదీలను హింసలు పెట్టినట్లుగా టార్చర్ పెట్టినట్లు చెప్పాడు. లైట్లు బంద్ చేయకపోవటంతో తన గదిలోకి పురుగులు కూడా వచ్చేసినట్లు తెలిపారు. అన్నంలో కూడా కొన్నిసార్లు పురుగులు వచ్చేవన్నారు. ఈ విషయాన్ని జైలు సిబ్బందికి చెప్పినా ఎవరూ వినిపించుకోలేదన్నారు. తన కూతురు లగ్గానికి కూడా హాజరుకాకుండా అడ్డుకున్నట్లు చెప్పాడు. మొత్తానికి జైలులో తానుపడిన హింసను రేవంత్ చెప్పటంతో విన్నవాళ్ళందరూ ఆశ్చర్యపోయారు.