మెస్సీకి ఎంత భద్రత కల్పించారో తెలుసా ?
x
Lionel Messi in Heavy security

మెస్సీకి ఎంత భద్రత కల్పించారో తెలుసా ?

మెస్సీకి రక్షణవలయంగా 28మంది బ్లాక్ క్యాట్ కమెండోలుంటారు


ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మరికొద్దిసేపటిలో హైదరాబాదులో అడుగుపెట్టబోతున్నాడు. హైదరాబాద్ లో మెస్సీ(Lionel Messi) సుమారు 30గంటలుంటారు. ఈ 20గంటల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. కనీవిని ఎరుగని రీతిలో(Football) ఫుట్ బాల్ దిగ్గజానికి ప్రభుత్వం Zప్లస్ సెక్యూరిటి ఏర్పాటుచేసింది. మెస్సీకి రక్షణవలయంగా 28మంది బ్లాక్ క్యాట్ కమెండోలుంటారు. మెస్సీ బసచేయబోయే(Falaknuma Palace) ఫలక్ నుమా ప్యాలెస్ చుట్టూతా కేంద్ర బలగాలు మోహరించాయి.

అలాగే ఉప్పల్ స్టేడియం దగ్గర మూడంచెల భద్రతను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఏర్పాటుచేశాయి. సీఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు లోకల్ పోలీసులు సుమారు 3 వేలమంది మోహరించారు. ఒక స్టేడియంలో ఇన్నివేలమంది పోలీసులు భద్రతగా మోహరించటం బహుశా ఇదే మొదటిసారేమో. ఎందుకింత భద్రత అంటే కోల్ కత్తాలో అడుగుపెట్టిన మెస్సీ కొద్దిసేపు సాల్ట్ లేక్ స్టేడియంలో గడిపారు. దిగ్గజాన్ని చూడాలన్న కోరికతో వేలాదిమంది అబిమానులు స్టేడియంలోకి పోటెత్తారు. అయితే స్టేడియంలోకి మెస్సీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. పట్టుమని పదినిముషాలు కూడా ఉండకపోవటంతో అభిమానులకు మెస్సీపైన మండిపోయింది.

అందుకనే వేలాదిమంది అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలో నుండి కుర్చీలు, వాటర్ బాటిళ్ళను గ్రౌండ్ లోకి విసిరేసి నిరసన తెలిపారు. దాంతో బిత్తరపోయిన పోలీసులు మెస్సీని అతికష్టంమీద స్టేడియంలో నుండి బయటకు తీసుకొచ్చారు. ఆ ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కోల్ కత్తా నుండి మెస్సీ 4.35 గంటలప్రాంతంలో హైదరాబాదు, శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఉప్పల్ స్టేడియంకు చేరుకునే మెస్సీ సుమారు 2 గంటలకు పైగా అక్కడే ఉంటారు.

రాత్రికి ఫలక్ నుమా ప్యాలెస్ లో బసచేయబోతున్న మెస్సీ ఆదివారం ఉదయం ముంబాయ్ కు వెళతాడు. అప్పటివరకు మెస్సీకి భారీ భద్రత ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత. కోల్ కత్తా కార్యక్రమంలో రబస అయ్యింది కాబట్టి హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం గట్టిగా డిసైడ్ అయ్యింది. కోల్ కత్తాలో ఎదురైన అనుభవంతో ఉప్పల్ స్టేడియంలోని అభిమానులు గ్రౌండ్ లోకి అడుగుపెట్టేందుకు లేకుండా ప్రభుత్వం అత్యంత భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. డీజీపీ శివధర్ రెడ్డి వ్యక్తిగతంగా స్టేడియం నుండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

రాహుల్ రాక

మెస్సీ మ్యాచ్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. మెస్సీ మ్యాచ్ చూడటానికి, మాట్లాడేందుకే రేవంత్ రెడ్డి ఆహ్వానంపై రాహుల్ హైదరాబాద్ వచ్చారు. అగ్రనేతకు రేవంత్ శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. రాహుల్ కూడా ఫలక్ నుమా ప్యాలెస్ లోనే బసచేయబోతున్నారు.

Read More
Next Story