ఇదండీ మన అంకెల కథ! ఆ రోమన్ అంకెలేమయ్యాయో, ఏమో!!
అంకెల పురాణం కూడా పెద్దదే. సున్నా (0)ని మనం కనిపెట్టడానికి పూర్వం పెద్ద కథే నడిచింది. సులువుగా ఉన్నవే శాశ్వతమని నిరూపితమైంది. అయితే గతాన్ని మరువకూడదు కదా..
భాషలన్ని రకాలు కాకపోయినా అంకెల్లోనూ చాలారకాలు ఉన్నాయి. అత్యధిక శాతం ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్న అంకెలను (మనతో సహా )- ఇండో అరబిక్ అంకెలు (Numerics) అంటారు.
ఇవి ఒకటి నుంచి తొమ్మిది ఆ తర్వాత సున్న ఉంటుంది. ఇదిగో ఇలా - 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 & 0 . వీటి వాడకం సులువు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా వాడకంలో ఉన్నాయి. సున్నా కనిపెట్టిన ఘనత కూడా మనదే.
మన తెలుగు భాషలానే , తెలుగు అంకెలున్నాయి. వాటిని గుర్తించగల చదువరులు ఇప్పుడు నూటికి పది శాతం కూడా ఉండరు . కారణం అలవాటు చెయ్యకోపోవటమే అని నా భావన. ఇదిగో అవి ఇలా ఉంటాయి. ఇప్పుడు గూగుల్ తెలుగులో టైపు చేసేటపుడు ఇవే వస్తుంటాయి. (౧,౨,౩,౪,౫,౬,౭,౮,౯,& ౦ ) వీటిని కూడ ఇండో అరబిక్ అంకెలలానే ఉపయోగించవచ్చు.
ఇకపోతే కొంత పరిచయమున్న లాటిన్/ రోమన్ అంకెలు. గతంలో స్కూళ్లలోనూ లెక్కల మాస్టారు చెప్పేవారు. బోర్డుపై రాసి చూపించేవారు. వాటిని మనలో చాలమందికి వీటి వాడకం ఒకటి నుంచి యాభై లోపే తెలుసు. అవి ఇలా ఉంటాయి. I , II , III , IV, V, VI, VII, VIII, IX, X - వీటిలో సున్న లేదు. ఇరవై సంఖ్య రాయాలంటే రెండు పది అంకెలు XX రాయాలి -
ఈ విధానంలో ..
1 - I
2 - II
3- III
4- IV
5 - V
6 - VI
7- VII
8- VIII
9- IX
10 - X
50 - L
100 - C
500 - D
1000 - M
ఈ పై అంకెలతోనే కావలసిన సంఖ్యలు తయారుచేసుకోవాలి-
ఉదాహరణకు :
2 - II , 3 - III - నాలుగును ఐదు అంకెకు ముందు ఒకటి అంకెను వేస్తారు, 4 - IV , 5 నుంచి 8 వరకు V పక్కన I, II, III చేర్చుతూ పోతారు. 9 కి పది (X) కి ముందు ఒకటి చేర్చుతారు IX -
39 రాయాలంటే X+X+X+ IX = 39
50 అంకెను L అని రాస్తారు. 40 అంకెను రాయాలంటే 10 - 50 ( యాభై అంకెకు ముందు రాసిన అంకెను అందులోనుంచి తీసి వేయాలి ) అంటే 40 ఐనట్లు . XL = 40
45 = 40 లోనుంచి 10 తీసి 5 కలపాలి =
XLV = 45 అలానే 69 కి 50 కి 10 + 9 కలపాలి =
LXIX = 69
100 ki C , 500 కి D, 1000 కి M - వీటితో కావలసిన అన్ని సంఖ్యలు తయారుచేసుకోవాలి .
501 = DI - D 500 + I 1 = 501
575 కి 500+50+10+10+5 ను D + L + X + X + V = DLXXV ఇలారాయాలి
చివరకు 940 ఎలా రాయాలో చెప్పుకుని చాలిద్దాం ఈనాటికి - 1000 - 100 + 40 = CMXL
ఇంత సరళం.. సారీ గరళంగా ఉన్నాయి కనుకనే ఇవి ఉనికిలో లేకుండాపోయి ఉంటాయి - సులువైనవి వచ్చేంత వరకూ ఇవే గతి అయ్యి ఉండి ఉంటాయి.
పాతరోజుల్లో బట్టల షాపుల్లో కోడ్ అంకెల్లా వీటినో , తెలుగు అంకెల్నో రాసేవారు - ఆకాలం వాళ్ళకు గుర్తుండే ఉంటుంది - బట్టల తానును చుట్టిన అట్టకు ఓ గుడ్డ లేబుల్ బీద రాసిన అంకెలు చూసి ధరచేప్పేవాళ్ళు సేల్సుమెన్లు కానీ యజమానులు కానీ - అవి కొనేవాళ్ళకర్ధమయ్యేవి కావు -
ఎవరికీ అర్ధం కాని వ్యవహారంలా తయారవబట్టే - ఇలా కనుమరుగైనవి -
ఐనప్పుడు వీటి గురించి తెలుసుకోవడమెందుకని మిత్రులెవరైనా ప్రశ్నించవచ్చు -
దానికి నా జవాబు : శ్రీ శ్రీ గారి వువాచ.. 'క్లాసిక్సు చదవండర్రా కవిత్వం ఎలా రాయగూడదో తెలుస్తుంది'
నమస్తే 🙏🏽
(గొర్రెపాటి రమేష్ చంద్ర బాబు)
Next Story