ఈ అలర్టులకు అర్ధాలు తెలుసా ?
x
Rain alerts

ఈ అలర్టులకు అర్ధాలు తెలుసా ?

అప్రమత్తంచేయటంలో భాగంగా అనేక రకాల అలర్టులను ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంటుంది. ఈ అలర్టుల్లో నాలుగు రకాలుంటాయని ఎంతమందికి తెలుసు ?


భారీవర్షాలు కురుస్తున్నాయంటే వాతావరణశాఖ జనాలను అప్రమత్తం చేస్తుందన్న విషయం తెలిసిందే. అప్రమత్తంచేయటంలో భాగంగా అనేక రకాల అలర్టులను ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంటుంది. ఈ అలర్టుల్లో నాలుగు రకాలుంటాయని ఎంతమందికి తెలుసు ? ఆ నాలుగు రకాల అలర్టుల్లో ఏరకం అలర్టు దేనికి సంకేతమో తెలుసా ? పలానా జిల్లాకు గ్రీన్ అలర్టని, పలానా ఏరియాలో రెడ్ అలర్టని వాతావరణశాఖ ప్రకటిస్తుంటుంది. అలర్టులు ఎందుకు ప్రకటిస్తుందంటే రాబోయే 24 గంటల్లో కురవబోయే వర్షపాతం, దాని తీవ్రత, జనాల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాలను బట్టి వాతావరణశాఖ నాలుగు అలర్టులను ప్రకటిస్తుంది.

అవేమిటంటే మొదటిది గ్రీన్ అలర్టు. రెండోది ఎల్లో అలర్టయితే మూడోది ఆరెంజ్ అలర్ట్. చివరది నాలుగో అలర్టు ఏమిటంటే రెడ్ అలర్టు. ఏదైనా ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో 6.4 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనే అంచనాలకు వస్తే అప్పుడు వాతావరణశాఖ గ్రీన్ అలర్టును ప్రకటిస్తుంది. ఈ అలర్టు కింద జనాలకు ప్రత్యేకంగా అలర్టులంటు జారీచేయటం ఉండదు. ఎందుకంటే 6.44 సెంటీమీటర్ల వర్షపాతం అంటే కాసేపు గట్టి వర్షంపడి ఆగిపోవటం అనుకోవాలి. అంతమాత్రం దానికి వాతావరణశాఖ అలర్టు ప్రకటించదు.

ఎల్లో అలర్టంటే ఏదైనా నిర్దిష్టమైన ప్రదేశంలో 6.45 సెంటీమీటర్ల నుండి 11..55 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుందని అంచనా వేస్తే వెంటనే వాతావరశాఖ ఎల్లో అలర్టును ప్రకటిస్తుంది. ఎల్లో అలర్టు జారీ అయ్యిందంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండమని జనాలకు చెప్పటమే. గంటసేపటిలోనో లేకపోతే రెండు మూడు గంటల వ్యవధిలో 11.55 సెంటీమీటర్ల వర్షపాతం కురవటం అంటే చిన్న విషయంకాదు. అంతటి వర్షం కురిసిన ప్రాంతంలో వాతావరణంలో సడెన్ గా మార్పులొచ్చేయటం ఖాయం. జనాలతో పాటు ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తుంది కూడా. అందుకనే జనాలకు ముందుజాగ్రత్తగా ఎల్లో అలర్టును ప్రకటిస్తుంది వాతావరణశాఖ.

మూడోది ఆరెంజ్ అలర్టు 24 గంటల్లో ఏదైనా ప్రాంతంలో 11.55 నుండి 20.44 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని చేసే హెచ్చరికే ఆరెంజ్ అలర్టు. 24 గంటల్లో 20.44 సెంటీమీటర్ల వర్షపాతం కురవటం అంటే కుంభవృష్టి అన్నమాట. కుంభవృష్టి కురిసిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమైపోతాయి. కుంభవృష్టితో పాటు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. దీనివల్ల చెట్లు, హోర్డింగులు, స్తంబాలు విరిగిపోవటం, ఒరగటం చాలా సహజం. ఇలాంటి సమయాల్లో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. విపరీతమైన ట్రాఫిక్ జామ్ తో పాటు జనజీవనం స్తంబిచిపోతుంది. దీనివల్ల జనాలు చాలా ఇబ్బందులు పడటం ఖాయం. అందుకనే వాతావరణశాఖ ఆరెంజ్ అలర్టును జారీచేస్తుంది.

చివరది రెడ్ అలర్టు. 24 గంటల వ్యవధిలో 24.45 సెంటీమీటర్లకు మించిన వర్షపాతం కురుస్తుందని తేలితే వెంటనే వాతావరణశాఖ రెడ్ అలర్టు ప్రకటిస్తుంది. 24 గంటల వ్యవధిలో 24.45 సెంటీమీటర్ల వర్షం నమోదవ్వటం అంటే అత్యంత భారీ వర్షాలనే చెప్పాలి. ఒకేసారి కురవకుండా విడతలవారీగా అదికూడా భారీవర్షాలు పడుతుంది. వాతావరణ శాఖ రెడ్ అలర్టు ప్రకటించిందంటే అర్ధం జనాలకు వర్షాల కారణంగా కష్టాలు తప్పవనే. అలాగే జనాలు ఎవరు కూడా అనవసరంగా బయట తిరగద్దని హెచ్చరిస్తుంటుంది. ఆస్తినష్టం, ప్రాణనష్టం అపారంగా జరిగే అవకాశముంది. ఇపుడు తెలుగురాష్ట్రాల్లో కురిసిన వర్షాలు రెడ్ అలర్టు కిందకే వస్తాయి. అందుకనే లక్షలాది మంది ప్రజల జనజీవనం అస్తవ్యస్ధమైపోయింది. సుమారు 60 మందికి పైగా చనిపోగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

రెడ్ అలర్టు జారీ అయ్యిందంటే విపత్తు నిర్వహణ దళాలతో పాటు ఇతర ప్రభుత్వ యంత్రాంగాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సహాయక చర్యల్లోకి దిగేస్తాయి. 24 గంటలకన్నా ఎక్కువసేపు రెడ్ అలర్టు ప్రభావం ఉండేట్లయితే ప్రభుత్వం సహాయ శిబిరాలను నిర్వహించి బాధితులను శిబిరాలకు చేర్చుతుంది. పరిస్ధితి రెడ్ అర్టు దాకా చేరుకుందంటే ఒక్కరోజుతో పోదు. కనీసం నాలుగైదు రోజులు అంటే ఇపుడు భారీవర్షాలు కురిసినట్లే అన్నమాట. రెడ్ అలర్టు తీవ్రత ఎంతుందో తెలుగురాష్ట్రాలను చూస్తే అర్ధమైపోవటం లేదూ.

Read More
Next Story