బీసీ రిజర్వేషన్లలో ‘త్రిపుల్ టెస్ట్’ విధానం అంటే ఏమిటో తెలుసా ?
x
Telangana High Court

బీసీ రిజర్వేషన్లలో ‘త్రిపుల్ టెస్ట్’ విధానం అంటే ఏమిటో తెలుసా ?

విచారణలో చీఫ్ జస్టిస్ ధర్మాసనం అనేక ప్రశ్నలు సంధించినప్పటికీ ఒకపాయింట్ అందరి దృష్టిని ఆకర్షించింది


స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై జరిగిన విచారణలో బుధవారం హైకోర్టులో కీలకమైన అనేక పాయింట్లపై వాదోపవాదాలు జరిగాయి. విచారణలో చీఫ్ జస్టిస్ ధర్మాసనం అనేక ప్రశ్నలు సంధించినప్పటికీ ఒకపాయింట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అదేమిటంటే త్రిపుల్ టెస్ట్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుసరించిందా ? అని ప్రభుత్వం తరపు లాయర్ అభిషేక్ మను సింఘ్వీని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ సూటిగా ప్రశ్నించారు. ఇక్కడే చాలామందికి త్రిపుల్ టెస్ట్ విధానం ఏమిటనే అనుమానాలు పెరిగిపోయాయి.

త్రిబుల్ టెస్ట్ విధానం ఏమిటంటే బీసీలకు రిజర్వేషన్లు పెంచటంవల్ల మొత్తంరిజర్వేషన్లు 50శాతంకు మించి పెరిగే క్రమంలో 2010లో సుప్రింకోర్టు ఒక ఫార్ములాను ప్రకటించింది. అదే త్రిపుల్ టెస్ట విధానం. ఆ త్రిపుల్ టెస్టులో మొదటి పాయింట్ ఏమిటంటే బీసీలు పొలిటికల్ గా వెనకబడి ఉన్నారా ? అనే విషయాన్ని తేల్చేందుకు ఒక డెడికేటెడ్ కమీషన్ ద్వారా అధ్యయనం చేయించటం. ఇక్కడ కేవలం పొలిటికల్ గా మాత్రమే విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం కాదు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావుతో ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ను నియమించింది. ఇంతవరకు ఓకేనే. తర్వాత చీఫ్ జస్టిస్ సంధించిన రెండో పాయింట్ (ప్రశ్న) ఏమిటంటే ఆ డెడికేటెడ్ కమిషన్ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు పెంచాలని సిఫారసు చేసిందా ? అని అడిగింది. మూడో పాయింట్ రూపంలో ప్రశ్న ఏమిటంటే కమిషన్ పబ్లిక్ నుండి వినతులు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించిందా ? అని అడిగింది.

కమిషన్ రిపోర్టును ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టిందా ? పబ్లిక్ డొమైన్లో పెట్టడం ద్వారా ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించిందా ? అని కూడా అడిగింది. అయితే కమిషన్ ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించిన విషయం, పబ్లిక్ డొమైన్లో కమిషన్ రిపోర్టును పెట్టడం గురించి సింఘ్వి స్పష్టమైన సమాధానం చెప్పలేదని సమాచారం. ఇదేసమయంలో పిటీషనర్ల తరపు లాయర్లు మాత్రం ప్రభుత్వం త్రిపుల్ టెస్ట్ విధానాన్ని అనుసరించలేదని గట్టిగా వాదించారు. కమిషన్ పబ్లిక్ నుండి వినతులను, అభ్యంతరాలను స్వీకరించలేదని, సూచనలు అందుకునేందుకు జిల్లాల్లో పర్యటనలు చేయాలేదని చెప్పినట్లు తెలిసింది. అలాగే కమిషన్ రిపోర్టును పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలనుండి అభ్యంతరాలను స్వీకరించలేదని వాదించారు. రెండువైపుల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణను గురువారం మధ్యాహ్నం 2.15కి వాయిదా వేసింది.

Read More
Next Story