అఘోరా కాదు అఘోరీనే..!
x

అఘోరా కాదు అఘోరీనే..!

మహిళే అని వైద్యులు చెప్పడంతో గురువారం ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. ఇప్పుడు వర్షిణిని ఏం చేయాలి? అన్న అంశంపై పోలీసులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.


అఘోరీ శ్రీనివాస్‌.. ఆడ, మగ? అన్న సందేహం కొన్ని రోజులుగా తెగ వినిపిస్తోంది. ఇటీవల చీటింగ్ కేసులో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులకు కూడా ఇదే చిక్కొచ్చి పడింది. సంగారెడ్డి జైలుకు పంపినప్పటికీ.. ఆడ, మగ అనేది తెలియకుండా ఎక్కడా ఉంచలేమని, లింగ నిర్ధారణ పరీక్షల తర్వాత ఏ విషయం చెప్తే.. దానిని బట్టి నడుచుకుంటామని చెప్పి జైలు అధికారులు అఘోరీని తిప్పి పంపించేశారు. దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాక.. లింగనిర్ధారణ పరీక్షలకు ఆదేశాలను కోర్టుతూ న్యాయమూర్తిని ఆశ్రయించారు. అందుకు న్యాయమూర్తి అంగీకారం తెలపడంతో.. అఘోరీకి వైద్య పరీక్షలు చేశారు.

చివరకు శ్రీనివాస్ అఘోరా కాదు అఘోరీనే అని స్పష్టం చేశారు. మహిళే అని వైద్యులు చెప్పడంతో గురువారం ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. యూపీలో అరెస్ట్ చేసి నిన్న హైదరాబాద్‌కు తీసుకొచ్చారు పోలీసులు.. అఘోరీ ప్రస్తుతం చంచల్ గూడ మహిళా జైలులో ఉన్నారు. కాగా అఘోరీ శ్రీనివాస్‌తో పాటు ఆమెను వివాహమాడిన వర్షిణిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను భరోసా సెంటర్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వర్షిణిని ఏం చేయాలి? అన్న అంశంపై పోలీసులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. లీగల్ నిపుణుల ప్రకారం వర్షిణి అంశంలో పోలీసులు ముందడుగు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read More
Next Story