కేంద్ర బడ్జెట్ 2025 నిజంగా పురోగతిని సూచిస్తుందా? లేక ఇవి ఖాళీ వాగ్దానాలేనా?
x

కేంద్ర బడ్జెట్ 2025 నిజంగా పురోగతిని సూచిస్తుందా? లేక ఇవి ఖాళీ వాగ్దానాలేనా?

ఈ బడ్జెట్ నిజంగానే దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుందా?


ఈ రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మధ్యతరగతి ఉద్యోగుల నుండి, రైతులు,మహిళలు,గిగ్ వర్కర్స్ దాదాపు అందరికి ఆశాజనకంగా ఈ బడ్జెట్ ఉండటం గమనార్హం. 12 లక్షల ఆదాయం వరకూ పన్ను లేకుండా ఉండటం, ఎస్సి ఎస్టి మహిళలకు 2 కోట్ల రుణ పథకాన్ని ప్రకటించడం, రైతుల కోసం ధనధాన్య కృషి యోజన, రిసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం ,ఏకీకృత విత్తననమోదు వంటివి ప్రకటించడం కొంత ప్రసంసల్ని అందుకుంటే ఉంటె, ఇంకొంత విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఈ బడ్జెట్ గురించి ఆర్థికవేత్తలు ఏమంటున్నారో చూద్దాం.

కేంద్ర బడ్జెట్ 2025 ఆర్థిక పురోగతిని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తూనే, ఋణ ఆధారిత వృద్ధిపై ఎక్కువ ఆధారపడటం వల్ల లోపభూయిష్టంగా ఉంది. ప్రభుత్వం సుక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు (MSMEs), వ్యవసాయం వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నా, ఇవి కేవలం ఋణాలకు సులభమైన అవకాశాలు మాత్రమే . ఈ బడ్జెట్ నిరుద్యోగులకూ, చిన్న వ్యాపారాలకూ నేరుగా స్థిరమైన ఉపాధిని అందించడం కంటే, వారిపై ఆర్థిక భారం మోపే విధంగా ఉంది.మహిళా ఉపాధి పరంగా కూడా బడ్జెట్ ఆశాజనకంగా లేదు. కార్మిక రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, అలాగే చక్కని వేతన ఉద్యోగాలను సృష్టించడానికి గానీ, ఉచిత కుటుంబ సంరక్షణ బాధ్యతల వంటి నిర్మాణాత్మక అవరోధాలను తగ్గించడానికి గానీ సరైన చర్యలు ఈ బడ్జెట్ లో లేవు.ప్రభుత్వం ఖాళీ వాగ్దానాలను అధిగమించి, మార్కెట్ల కంటే ప్రజలను ముఖ్యంగా పరిగణించాలి, అప్పుడే దేశం నిజమైన, సమానమైన ఆర్థిక అభివృద్ధిని సాధించగలదు.

-బొడ్డు సృజన , అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ ,ఎస్ ఆర్ ఎం యునివర్సిటీ

వ్యవసాయానికి సంబంధించి ఈ బడ్జెట్ ప్రోత్సాహకరంగా ఉంది. మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి వర్గాలకు ఈ బడ్జెట్ చాలా ఊరట కలిగిస్తుంది. కేంద్ర బడ్జెట్ లో వృద్ధులకు సంబంధించి ప్రకటించిన ఊరట అన్ని వర్గాల వృద్ధులకు ప్రయోజనకరంగా ఉంటుందో లేదో వేచి చూడాలి. మొత్తంగా చూసినప్పుడు ఈ బడ్జెట్ మంచి భవిష్యత్తుకు బాటలు వేసేదిగా ఉంది.

-ప్రభాకర్ రెడ్డి ,ఆర్ధిక వేత్త,విధాన నిర్ణయ సభ్యుడు (తెలంగాణ ప్రభుత్వ సలహాదారు)

ఈ బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చినట్టు కొందరు అభిప్రయపడుతున్నా,ఇది రైతులకు మేలు చేసే బడ్జెట్ అని అప్పుడే నిర్ధారణకు రాలేము. వ్యవసాయ రంగం తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న చేనేత రంగానికి ఈ బడ్జెట్ లో పెద్దగా మేలు జరిగినట్టు నాకు అనిపించలేదు. ఇంత పెద్ద దేశానికి కేవలం 200 కోట్ల రూపాయలు కేటాయించి అదే పెద్ద గొప్ప బడ్జెట్ అనడం సరికాదు. ఈ మొత్తంతో ఏం చేస్తారు అనేది ప్రశ్నార్థకం. మొత్తం మీద చుస్తే ఈ బడ్జెట్ గతంలో ఎలా ఉందో అలాగే ఉన్నా, వేతన జీవులకు ,గిగ్ వర్కర్స్ కు ఏ మాత్రం ఊరట కలిగినా సంతోషమే.

- డాక్టర్ దొంతిరెడ్డి నరసింహరెడ్డి,చేనేత జౌళి రంగాల సలహా మండలి సభ్యుడు



Read More
Next Story