భయపడొద్దు.. ధైర్యంగా ఉండు, రోడ్డు ప్రమాద బాధితురాలికి బండి సంజయ్ భరోసా
x

భయపడొద్దు.. ధైర్యంగా ఉండు, రోడ్డు ప్రమాద బాధితురాలికి బండి సంజయ్ భరోసా

కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రోడ్డు ప్రమాద బాధితురాలికి సకాలంలో సాయం అందేలా చేయడమే కాకుండా.. వైద్యానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని..


కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. లారీ కింద పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువతిని కాపాడి ధైర్యం చెప్పడమే కాకుండా తల్లిని చూసి ఏడుస్తున్న పిల్లలను సముదాయించారు. వివరాల్లోకి వెళితే.. మానకొండూరు మండలం కల్లేడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ , హుజురాబాద్ మండలం సింగాపురం గ్రామానికి వచ్చింది.



హైవే ను దాటే క్రమంలో వేగంగా వచ్చిన లారీని తప్పించుకోబోయే రోడ్డు కింద పడుకుంది. అయితే లారీ అదే వేగంతో వెళ్లే క్రమంలో దివ్యశ్రీ జుట్టు లారీ కింద ఉన్న రాడ్డుకు చిక్కుకుపోయింది. అయితే లారీ డ్రైవర్ అదే స్పీడు తో లారీని ముందుకు తీసుకెళ్లడంతో రోడ్డుపై ఈడ్చుకుంటూ వచ్చింది. అయితే లారీ కింద నుంచి అరుపులు వినిపించడంతో డ్రైవర్ లారీ ఆపి చూడగా కింద దివ్యశ్రీ చిక్కుకుని కనిపించింది. తల నుంచి రక్తం ధారలుగా కారుతుండటంతో ఎవరూ ముట్టుకోవడానికి సాహసించలేదు.




అదే సమయానానికి కరీంనగర్ నుంచి ములుగు జిల్లా కేంద్రానికి వెళ్తున్న ఎంపీ బండి సంజయ్ ప్రమాదస్థలి దగ్గర గుమిగూడీ ఉన్న ప్రజలను చూసి కారును ఆపాడు. ప్రజలు సాయం చేయడానికి జంకుతుండటంతో అటుగా వెళ్తున్న లారీలను ఆపి వాటి నుంచి జాకీలు బయటకు తీయించి.. వాటి సాయంతో లారీని పైకి ఎత్తించి, కత్తెర సాయంతో రాడుకు చిక్కుకుపోయిన దివ్యశ్రీ జుట్టును కత్తిరించే ఏర్పాటు చేయించారు.



తల్లి దివ్యశ్రీ పరిస్థితి చూసి భోరున ఏడుస్తున్న పిల్లలను సముదాయించాడు. బాధితురాలిని అంబులెన్స్ లో హుటాహుటిన కరీంనగర్ లోని లైఫ్ లైన్ ఆస్పత్రికి పంపించాడు. వైద్యానికి అయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తానని వైద్యులకు చెప్పారు.
Read More
Next Story