
ఖర్చుకు వెనకాడొద్దు.. లింక్ రోడ్ల నిర్మాణంపై సీఎం
తమ ప్రభుత్వానికి ప్రజల అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యమని, ఖర్చు తగ్గించుకోవడం కాదని తెలిపారు.
హైదరాబాద్‌లో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ అనుసంధాన రహదారుల నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులను చేపట్టేందుకు సిద్ధమయింది. ఈ క్రమంలోనే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండీఏ పరిధిలోని 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల అనుసంధానం, ఆటంకాలు లేని రాకపోకలకు వీలుగా రహదారుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణాలు చేయాలని, ఖర్చు విషయంలో వెనకాడొద్దని ఆదేశించారు. తమ ప్రభుత్వానికి ప్రజల అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యమని, ఖర్చు తగ్గించుకోవడం కాదని తెలిపారు.
‘‘ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోంది. అదనపు భూసేకరణ విషయంలో ఖర్చు గురించి ఆలోచించొద్దు. ప్రజల అవసరాలు తీరడమే ప్రధానం. అందుకోసం తమ ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా చేయడానికి సిద్ధంగా ఉంది’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.