తెలంగాణలోనూ ‘పూజ ఐఏఎస్ ’ లాంటి కేసు?
x
Praful Desai and Puja

తెలంగాణలోనూ ‘పూజ ఐఏఎస్ ’ లాంటి కేసు?

పూజా ఖేడ్కర్ వ్యవహారం ఒక వైపు సంచలనంగా మారుతుంటే మరోవైపు అలాంటి సంచలనమే తెలంగాణాలో కూడా బయటపడింది.


అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల ఎంపికలో తెలంగాణా క్యాడర్ కు సంబంధించి మరో గందరగోళం బయటపడింది. మహారాష్ట్ర క్యాడర్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం ఒక వైపు సంచలనంగా మారుతుంటే మరోవైపు అలాంటి సంచలనమే తెలంగాణాలో కూడా బయటపడింది. విషయం ఏమిటంటే తెలంగాణాలోని కరీంనగర్లో అడిషినల్ కలెక్టర్ గా పనిచేస్తున్న ప్రఫుల్ దేశాయ్ ఎంపికపైన కూడా అనేక ఆరోపణలు ముసురుకుంటున్నాయి.

2019లో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో ప్రఫుల్ దేశాయ్ 532 ర్యాంకు సాధించారు. ఇపుడు దేశాయ్ ను చుట్టుముట్టిన వివాదాలు ఏమిటంటే ఈయన సైక్లింగ్ చేస్తున్న, టెన్నిస్ ఆడుతున్న, గుర్రపు స్వారి, రివర్ రాఫ్టింగ్ చేస్తున్న ఫొటోలు వైరల్ గా మారాయి. ఐఏఎస్ అధికారులు సైక్లింగ్ చేయకూడదా ? గుర్రపు స్వారీ చేయకూడదా ? అనే సందేహాలు రావటం చాలా సహజం. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఎంపికైన దేశాయ్ తాను ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కు చెందిన వ్యక్తిగా చెప్పుకుంటూనే ఆర్ధోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ గా క్లైం చేసుకున్నారు. ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ అంటేనే రెండు కాళ్ళు లేదా రెండింటిలో ఏదో ఒకదానికి వైకల్యం ఉన్నట్లే కదా ?




మరి కాలు సరిగాలేని దేశాయ్ సైక్లింగ్, హార్స్ రైడింగ్, టెన్నిస్ ఎలా ఆడగలరు ? అంటు ట్విట్టర్ వేదికగా నెటిజన్ సందేహాలు వ్యక్తంచేశారు. దేశాయ్ గుర్రపు స్వారి, సైక్లింగ్ చేస్తున్న, రివర్ రాఫ్టింగ్ చేస్తున్న ఫొటోలను కూడా నెటిజన్ పోస్టుచేశారు. ఇపుడా ఫొటోలు వైరల్ గా మారాయి. యూపీఎస్సీకి ఎంపిక అవ్వాలని ఎంతోమంది ఎంతో కష్టపడుతున్నారని సదరు నెటిజన్ తెలిపారు. తన ఎంపిక గురించి అలాంటి ఆశావహులందరికీ వివరణ ఇవ్వాలని నెటిజన్ దేశాయ్ ను అడిగారు. మహారాష్ట్రలోని పూజా దేశాయ్ వివాదం ఒకవైపు సంచలనం అవుతున్న నేపధ్యంలోనే దేశాయ్ ఉదంతం వెలుగుచూసింది. వీళ్ళ ఎంపిక విధానాన్ని గమనించిన తర్వాత అసలు యూపీఎస్సీ ఎంపిక విధానంపైనే చాలామందిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి.




యూపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షలు, చేస్తున్న ఇంటర్వ్యూలన్నీ పాదర్శకంగానే జరుగుతున్నాయా అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలో ఎంపికై రెండేళ్ళు ముస్సోరీలోని లాల్ బహద్దూర్ శాస్త్రీ నేషనల్ అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ తీసుకున్న తర్వాత పోస్టింగులో జాయిన్ అయ్యారు. ఉద్యోగ నిర్వహణలో వీళ్ళ బండారం బయటపడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంత వరకు యూపీఎస్సీ, కేంద్రప్రభుత్వం మేల్కొనలేదంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇపుడు దేశాయ్ ఆర్ధోఫెడిక్ హ్యాండీక్యాప్డ్ వైకల్యాన్ని ఏ విధంగా జయించారనే విషయమై నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిజంగానే దేశాయ్ అంగవైకల్యంతో ఉండి యూపీఎస్సీకి ఎంపికైన తర్వాత ఆ వైకల్యాన్ని అధిగమిస్తే ఆ విషయం ఎంతోమంది యువతకు స్పూర్తిదాయకం అవుతుందనటంలో సందేహంలేదు. మరి వీటికి జవాబులు దేశాయ్ చెబుతారా ? లేకపోతే యూపీఎస్సీ, కేంద్రప్రభుత్వం చెబుతుందా ? అన్నది ఆసక్తిగా మారింది.


ఆరోపణలపై దేశాయ్ ఏమన్నారు


ఆయనేమన్నారంటే 2018, 19లో కూడా తాను యూపీఎస్సీ పరీక్ష పాసై ఇంటర్వ్యూకి వెళ్ళినపుడు ఎయిమ్స్ లోని మెడికల్ బోర్డ్ తనను పరీక్షించిందట. 2018లో ఇంటర్వ్యూ పాస్ కాకపోయినా 2019లో పాసైనట్లు చెప్పారు. తప్పుడు సర్టిపికేట్లతో పరీక్షలు పాసవ్వటం, ఉద్యోగాలు సంపాదించటానికి తాను కూడా వ్యతిరేకమే అన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతన్నట్లు ఆయన కూడా అంగీకరించారు. తాను సైక్లింగ్ చేయటం, గుర్రపుస్వారి చేస్తున్న ఫొటోల గురించి మాట్లాడుతు అవన్నీ శిక్షణలో భాగంగా చేసినట్లు చెప్పారు. తన వైకల్యాన్ని అధిగమించి ఇతరుల్లాగ మామూలు జీవితాన్ని జీవించాలని అనుకోవటం తప్పా అని నెటిజన్లను నిలదీశారు.

వాస్తవాలు ఏమిటో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయటం వల్ల తనతో పాటు తన కుటుంబం ఎంత మానసిక క్షోభకు గురవుతుందో ఆలోచించాలన్నారు. ఇప్పటికి కూడా తాను మెడికల్ టెస్టు చేయించుకోవటానికి రెడీగా ఉన్నట్లు స్పష్టంగా ప్రకటించారు.

Read More
Next Story