పాతబస్తీలో డ్రగ్ ఇంజెక్షన్ల దందా
x

పాతబస్తీలో డ్రగ్ ఇంజెక్షన్ల దందా

డ్రగ్ ఇంజెక్షన్ల దందాపై ఫుల్ ఫోకస్ పెట్టిన పోలీసులు.


పాతబస్తీలో డ్రగ్స్ ఇంజెక్షన్ల దందా జోరుగా సాగుతోంది. ఈ అంశంపై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. అనుమానం ఉన్నవారిపై నిఘా పెడుతున్నారు. యువతకు అసలు ఈ ఇంజక్షన్లు ఎక్కడి నుంచి లభిస్తున్నాయి? ఎవరు విక్రయిస్తున్నారు? వీటి వెనక సూత్రధారి ఎవరు? అన్న కోణాల్లో దర్యాప్తు చస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. ఇటీవల అనస్థీషియా డ్రగ్ తీసుకుని ముగ్గురు యువకులు మరణించారు. వారు ఓవర్ డోస్ కారణంగానే మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ అంశంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. ఒక్కో ఇంజక్షన్‌కు యువకులు వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారని పోలీసులు గుర్తించారు.

ప్రధాన కొనుగోలు దారులు వీరే

ఈ మత్తు ఇంజక్షన్లను ప్రధానంగా విద్యార్థులు, ఆటో డ్రైవర్లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఈ ఇంజక్షన్ల దందా వెలుగు చూసింది. ఈ ఇంజక్షన్ల దందా వెనక ఎవరున్నారు? అన్న అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఇంజక్షన్లు అమ్ముతున్న ఇద్దరు డాక్టర్లతో పాటు, కొనుగోలు చేసిన నలుగురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఈ దందా కింగ్‌పిన్ ఎవరు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More
Next Story