EARTH QUAKE| తెలుగు ప్రజల్ని హడలెత్తించిన భూకంపం
రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఉదయం వచ్చిన భూ ప్రకంపనలు జనాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాయి. తెలుగురాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో భూమి స్వల్పంగా కంపించింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఉదయం వచ్చిన భూ ప్రకంపనలు జనాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాయి. తెలుగురాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో భూమి స్వల్పంగా కంపించింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత కొన్ని ప్రాంతాల్లో 5.03, 5.02, 5.01 గా నమోదు అయింది.
బుధవారం ఉదయం 7.27 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.03గా నమోదైంది. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ?
ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని కేపీహెచ్బీ, గోకుల్ ప్లాట్స్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టయగూడెం, టి.నరసాపురం మండలం బొర్రాంపాలెం, జంగారెడ్డిగూడెం పట్టణంలో భూమి కంపించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, గంపలగూడెం, అనుముల్లంక, తిరువూరు, పెనుగంచిప్రోలు
వరంగల్ జిల్లాలోని నర్సంపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, చెన్నారావుపేట మండల కేంద్రంలో భూమి కంపించింది.
1969 తర్వాత ఇదే తొలిసారి..
1969లో భద్రాచలం పరిసరాల్లో దాదాపు ఇదే తీవ్రతతో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సుమారు 50 ఏళ్ల తర్వాత నేడు ఆ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు. భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థానచలనం జరిగి ప్రకంపనలు వస్తుంటాయని తెలిపారు.హైదరాబాద్, భద్రాచలం, ఏటూరు నాగారం, ములుగు తదితర ప్రాంతాలు జోన్-3లో ఉన్నాయన్నారు. జోన్-5లో ఉన్న ఉత్తర భారతంలోని ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకన్లపాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందని సమాచారం. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు పెట్టారు. రాజమండ్రిలోనూ అతి స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది. పెనుగంచిప్రోలు, గంపలగూడెం, పాత తిరువూరులో ఉదయం 7:40 గంటలకు కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపించింది. రెడ్డిగూడెం, నందిగామ, కంచికచర్ల మండలాల్లోనూ స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోనూ భూప్రకంపనలు వచ్చాయిన
Next Story