ఈటెల రాజేందర్ చూపు ఇక గాంధీ భవన్ వైపేనా...
x
ఈటెల బిజెపి చాప్టర్ క్లోజ్ అవుతున్నదా?

ఈటెల రాజేందర్ చూపు ఇక గాంధీ భవన్ వైపేనా...

తెలంగాణ బిజెపి ఆఫీస్ కు గాంధీ భవన్ చాలా దగ్గిర. రోడ్ క్రాస్ చేస్తే గాంధీ భవన్ లోకి రావచ్చు. అనుకుంటే ఐదు నిమిషాల పని. ఈటెల ఇలా అనుకుంటున్నాడని ఒకటే టాక్


క్యాబినెట్ విస్తరణ తర్వాత సిఎం రేవంత్ కాంగ్రెస్ విస్తరణకోసం వల విసురుతారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారు.

బిజెపి నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరతారనే మాట బలంగా వినబడుతూ ఉంది.వీలయితే, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారుని కూడా వినికిడి. ఈటెల రాజేందర్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోవడంతో ఆయన ఇక పార్టీలో కొనసాగేఅవకాశం లేదని ఆయన సన్నిహితులొకరు ఫెడరల్-తెలంగాణకు తెలిపారు.

"ఎన్నికల్లో గెల్చిఉంటే రాజేందర్ హోదా మరొక విధంగా ఉండేది. ఓడిపోయాక బిజెపిలో ఆయన ప్రత్యర్థులది పై చేయి అయింది. అందువల్ల పార్టీలో ఆయనకు మళ్లీ మునుపటి ప్రాముఖ్యం లభించకపోవచ్చు. ఇక రాజేందర్ పార్టీ మారే యోచన చేయవచ్చు. ఒక వేళ అదే జరిగితే, కాంగ్రెసే ఆయన బెస్ట్ చాయిస్," ఆయన చెప్పారు.

టిఆర్ ఎస్ (ఇపుడుబిఆర్ ఎస్ ) నుంచి అవమానకరకంగా బయట పడిన విధానం ఆయన్ని బిజెపి వైపు నడిపించింది. ఆయన కెసిఆర్ ప్రభుత్వం వెంటాడిన తీరు. వచ్చిన సంపిథీ చూసి బిజెపి సంతృప్తి చెంది, ‘పార్టీకి ఒక మంచి ప్రాంతీయ నాయకుడు దొరికాడు‘ అని భావించింది. ఆయన హూజూరా బాద్ ఉప ఎన్నికల్లో గెలిచాక పార్టీ పూర్తిగా కన్విన్స్ అయి ఆయనకు ప్రాముఖ్యం పెంచింది. భావినాయకుడు అనే ఇంప్రెషన్ ఇచ్చింది.కొంతమంది మరీ ఆవేశపడి ఆయన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పోల్చారు. బిజెపికి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడని కూడా లెక్క కట్టారు. అన్నివర్గాలు ఇష్టపడే నాయకుడొకడు దొరికాడని భావించి పార్టీ కూడా ఆయన మాటకు బాగా విలువనచ్చింది. అంతెందుకు, బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవినుంచి మార్చాలనుకున్నపుడు పార్టీ ఆయన అభిప్రాయానికి చాలా విలువనచ్చిందని ఈటెల రాజేందర్ మాట వినే బండిని అధ్యక్షపదవినుంచితొలగించారని సంజయ్ సన్నిహితులొకరు చెప్పారు.

ఈ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ ల నుంచి ఓడిపోవడంతో ఈటెల ప్రాముఖ్యం బిజెపిలో తగ్గనుంది. దానికితోడు పార్టీకి ఒక వేళ అధ్యక్షుడిని నియమించాల్సి వస్తే, ఆయన పేరును పరిశీలించే అవకాశం లేదని కూడా తెలిసింది. ఈటెల కూడా బిజెపికి నాయకత్వం వహించాలని అనుకోవడం లేదు. ఆయన తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని భావించే బిజెపికి ప్రచారం చేశారు. ఆయన ప్రచార శైలి ‘పక్కాబిజెపి’ వాళ్లకి నచ్చలేదు. ఆయన ఉపన్యాసాలలో హిందూత్వం బొత్తిగా లేకపోవడం కట్టర్ బిజెపి సభ్యులకురుచించలేదు. వీళ్లంతా ఇపుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనికి తోడు బండి సంజయ్ వర్గం కూడా కత్తి దూస్తున్నది.

ఈ సెగలో ఈటెల బిజెపిలో కొనసాగకపోవచ్చని చెబుతున్నారు. ఈటెల లక్ష్యమంతా రాష్ట్ర రాజకీయాల్లో కోల్పోకుండా ఉండటమే. ఇలా రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ,"నువ్వు తీసేస్తే నా రాజకీయం బంద్ అవుతుందనుకున్నావేమో, నేనుచూడు నేనింకా బలవంతుడినే" అని కెసిఆర్ కు మెసేజ్ పంపాలనుకున్నాడు. అయితే, మెసేజ్ మరొకలా వెళ్లింది. కెసిఆర్ పార్టీ పోయింది. ఈటెల పార్టీ పోయింది. మధ్యలో కాంగ్రెస్ వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటిలాగా తెలంగాణ బిజెపి కి ఓట్లువస్తాయన్ని గ్యారంటీలేదు. అందువల్ల ఈటలకు బిజెపిలో ఉంటే ఏదో ఒక చిన్న బాధ్యత ఇస్తారు తప్ప గుర్తింపు తెచ్చే పొజిషన్ రాదు. ఈ కారణంతో కాంగ్రెస్ లోకి వెళ్లి లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయడమె లేక లేదా కాంగ్రెస్ తరఫున పనిచేయడం ప్రయోజనకరం అని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది.

క్యాబినెట్ విస్తరణ తర్వాత పార్టీ విస్తరణ కోసం రేవంత్ వల విసురుతాడని అపుడు చాలా మంది బిఆర్ ఎస్ వాళ్లు, బిజెపి వాళ్లు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ లో టాక్. అప్పటిదాకా టాక్ వినబడుతూ ఉంటుంది. బలపడుతూ ఉంటుంది.

ఇదంతా తప్పుడు ప్రచారం: ఈటెల

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న సోషల్ మీడియా వార్తలపై ఈటెల రాజేందర్ వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరడంలేదని స్పష్టం చేశారు. "కాంగ్రెస్ నాపై దుష్ప్రచారం చేస్తండాలి. . లేదంటే బీజేపీలో ఉన్నవారే నేను బీజేపీని వదలివెళ్లాలని అనుమానం వస్తున్నది,‘ ఆయన పేర్కొన్నారు.. భారతీయ జనతా పార్టీలోనే ఉంటూ, మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.



Read More
Next Story