ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసింది. మే 2న నోటిఫికేషన్, 27న పోలింగ్ జరగనుంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసింది. మే 2 న నోటిఫికేషన్, మే 27 న పోలింగ్ జరగనుంది. మే 2 నుంచి 9 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మే 27 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూన్ 5 వ తేదీ ఉదయం ఓట్ల లెక్కింపు ఉండనుంది. అదే రోజు సాయంత్రం విజేతను ప్రకటించనున్నారు.
కాగా, వరంగల్ - ఖమ్మం - నల్లగొండ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచినా అనంతరం పల్లా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఎన్నిక జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది. క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను అభ్యర్థిగా ప్రకటించింది.
తీన్మార్ మల్లన్న 2021, మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యాడు. తీన్మార్ మల్లన్న 2021 డిసెంబరు 7న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ముందు బీజేపీని విడిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.