
రేవంత్ తో ఆర్థిక సలహా మండలి చైర్మెన్ భేటీ
సమాఖ్య విధానం అమలు చేయాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రధాన మంత్రి ఆర్థిక సలహామండలి చైర్మన్ ఎన్ మహేంద్రదేవ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జూబ్లిహిల్స్ లోని సిఎం నివాసంలోనే ఈ భేటీ జరిగింది. తెలంగాణ అభివృద్ది చెందాలంటే సమాఖ్య విధానం అమలు చేయాలన్నారు.సమాఖ్య విధానంలో పరస్పరం ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలని రేవంత్ అన్నారు. రాష్ట్రాలు అభివృద్ది చెందితేనే దేశం అభివృద్ది చెందుతుందని రేవంత్ రెడ్డి ఆర్థిక సలహా మండలి చైర్మన్ తో అన్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ప్రణాళిక సిద్దం చేసినట్లు రేవంత్ చెప్పారు.
ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి చైర్మన్‌గా ఇటీవల నియమితులయ్యారు. ప్రభుత్వ పాలసీల రూపకల్పనలో ప్రధానికి సూచనలిచ్చే ఆర్థిక సలహా మండలిలో ఎపికి చెందిన మహేంద్రదేవ్ ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టారు
Next Story