కేటీఆర్‌కు మరో ఝలక్.. కేసు నమోదు చేసిన ఈడీ
x

కేటీఆర్‌కు మరో ఝలక్.. కేసు నమోదు చేసిన ఈడీ

ఫార్ముల-ఈ కార్ రేసు కేసు విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో షాక్ తగిలింది.


ఫార్ముల-ఈ కార్ రేసు కేసు విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో షాక్ తగిలింది. ఏసీబీ నమోదు చేసిన కేసు నుంచి స్వల్ప ఊరట లభించిందని సంతోషపడేలోపే ఈడీ చేదు విషయం వెల్లడించింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. కేటీఆర్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మరో కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. తెలంగాణ హైకోర్టులో ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి కేటీఆర్‌కు ఊరట లభించిన గంటల వ్యవధిలోనే ఈడీ రంగంలోకి దిగింది. ఫార్ములా-ఈ కార్ రేసు‌ అంశంపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఏసీబీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్‌ను నమోదు చేసింది. ఈడీ కేసు నమోదు చేయడంలో ఈ రేసు కేసు మళ్ళీ మొదలుకొచ్చినట్లయింది. ఏసీబీ కేసు నమోదు చేసిన క్రమంలో అరెస్ట్ నుంచి ఊరట పొందిన కేటీఆర్.. ఇప్పుడు ఏం చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అంతేకాకుండా ఏసీబీ కేసులో ఊరట లభించగానే.. రేసు కేసు డొల్ల కేసని, అది తొలిఅడుగులోనే కాంగ్రెస్‌కు చుక్కెదురైందంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.

Read More
Next Story