కవిత భర్త అనిల్ కి ఈడీ నోటీసులు
x

కవిత భర్త అనిల్ కి ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈడి అధికారులు ఆమెను ఈరోజు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితని విచారించడానికి ఇంకా వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడి కోర్టును కోరింది. దీంతో న్యాయస్థానం ఈనెల 23వ తేదీ వరకు ఆమెకు రిమాండ్ విధించింది.

కవిత రిమాండ్ లో ఉండగా ఆమె భర్త అనిల్ కి కూడా ఈడి నోటీసులు పంపింది. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అనిల్ తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బంది కూడా ఈడి నోటీసులు పంపింది. అనిల్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు విచారించనున్నారు. కాగా శుక్రవారం ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు ఫోన్లను అధికారులు సీజ్ చేశారు.

Read More
Next Story