
KTR | ఈ-కార్ రేస్ కేసులో ఈడీ అత్యుత్సాహం చూపిస్తోందా..?
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఏసీబీ సైతం దర్యాప్తును ముమ్మరం చేసింది.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఏసీబీ సైతం దర్యాప్తును ముమ్మరం చేసింది. ఐఏఎస్ ఆరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను జనవరి 2,3 తేదీల్లో విచారించనున్నారు. ఈ క్రమంలోనే జనవరి ఏడో తేదీని విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌కు ఏసీబీ కౌంటర్ వేసింది. కేటీఆర్ ఒత్తిడితోనే ఆర్థిక శాఖ, కేంద్రం నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినా హెచ్‌ఎండీఏ రూ.55 కోట్ల నగదును విదేశీ సంస్థకు చెల్లించిందని, దాని కారణంగా ఆర్‌బీఐ.. హెచ్‌ఎండీఏకు రూ.8 కోట్ల జరిమానా వేసిందని గుర్తు తెలిపింది ఏసీబీ. తాజాగా ఈ అంశంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విషయంలో ఈడీ అత్యుత్సాహం చూపిస్తోందంటూ మండిపడ్డారు కేటీఆర్. తనకు విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చిందని, అందులో సందేహం అక్కర్లేదని చెప్పారు.
‘‘ఏ కేసులో దూకుడుగా లేని ఈడీ.. ఈ కేసులో మాత్రం ఎక్కడా లేని అత్యుత్సాహం కనబరుస్తోంది. నేను ఎఫ్ఐఆర్‌ను ఛాలెంజ్ చేస్తున్నా. కోర్టు ఏం చెప్తోంది. కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఏవీ ఉండవు కదా. ఇంతలోపే ఇంతటి తొందర ఎందుకు ఈడీ. ఈ కేసుపై అంత ఇంట్రస్ట్ ఎందుకు. మేము ఏం చెప్పాలో అది కోర్టులో చెప్తాం’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాగా ఈ కేసులో ఈడీ ఏమీ దూకుడుగా లేదని, ఎప్పటిలనే దర్యాప్తును కొనసాగిస్తోందిన సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఏ కేసు అయినా సాక్ష్యాలు, ఆధారాలు లభించిక ఝటిలం అయితే అది మందకొడిగా కొనసాగుతుందని, అలా కాకుండా అన్నీ లభిస్తుంటే దర్యాప్తు శరవేగంగా సాగుతుందని, ఈ-కార్ రేసు కేసులో కూడా అదే జరుగుతుందే తప్ప.. ఎవరినీ టార్గెట్ చేస్తూ ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదని పలువురు మేధావులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.