మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు..
x

మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.


మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు ఏకకాలంలో తెలంగాణలో 16 ప్రాంతాల్లో సోదాలు చేశాయి ఈ బృందాలు. వీటిలో ఒకటి తెల్లవారుజామున మంత్రి పొంగులేటి శ్రీనివస్ ఇంటికి చేరుకుంది. సీఆర్‌పీఎఫ్, పోలీసుల భద్రత నడుమ ఈ సోదాలు జరిగాయి. సోదాల నేపథ్యంలో పొంగులేటి ఇంటికి రాకపోకలను కూడా ఆపేశారు భద్రతా సిబ్బంది. ఇంటితో పాటు మంత్రి పొంగులేని కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. అన్ని ఫైళ్లను అధికారులు తరువుగా తనిఖీ చేస్తున్నారు. అయితే పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. గతేడాది నవంబర్ 3వ తేదీన కూడా ఖమ్మంలోని పొంగులేటి నివాసంలో, హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్‌లోని మరో నివాసంలో కూడా ఈడీ, ఐటీ సోదాలు జరిగాయి. అదే విధంగా నవబంర్ 10న బంజారాహిల్స్‌ రోడ్ 10లోని రాఘవా ఫ్రైడ్‌లో కూడా తనిఖీలు జరిగాయి. కాగా ఈ రోజు జరుగుతున్న సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి సోదాలు చేస్తున్నారన్న సమచారం కూడా ఇంకా బయటకు రాలేదు.

Read More
Next Story