హైదరాబాద్ లో ఈడీ సోదాలు..
x

హైదరాబాద్ లో ఈడీ సోదాలు..

ఎపి లిక్కర్ స్కాం కేసులో నిందితుల ఇళ్లలో, కార్యాలయాల్లో


ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్ లో సోదాలు జరిపారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 20 చోట్ల ఏక కాలంలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుతో సంబంధమున్న వ్యాపారవేత్తలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని వెల్లింగ్టన్ ఎన్ క్లేవ్ లో వ్యాపారవేత్త బూరుగుపల్లి రమేష్ ఆయన కుమారుడు విక్రాంత్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. విల్లా 26లో నివాసముంటున్న బూరుగుపల్లి రమేష్ , ఆయన కుమారుడు విక్రాంత్ నివాసాల్లో రెండు బృదాల ఈడీ అధికారులు సోదాలు చేశారు. కాస్పో లీగల్ సర్వీసెస్, మహరాజ జెవెలర్స్ , రాజశ్రీ ఫుడ్ డైరెక్టర్ గా ఉన్న విక్రాంత్ నివాసాల్లో సోదాలు జరిగాయి.ఈ దాడులకు సంబంధించిన మరింత సమాచారం రావాల్సి ఉంది.

ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏక కాలంలోజరుగుతున్నాయి.

ఎపి లిక్కర్ కేసులో

సంచలనం సృష్టించిన ఎపి లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ముగ్గురు బెయిల్ పై విడుదలయ్యారు. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి తాత్కాలిక బెయిల్ పై విడుదలైనప్పటికీ ఈ నెల 11న రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయారు. ఈ స్కాంతో సంబంధమున్న ఐదు రాష్ట్రాల్లో ఉన్న నిందితుల ఇళ్లలో దాడులు జరగడం చర్చనీయాంశమైంది.

ఎపి లిక్కర్ స్కాం రూ 3, 500 కోట్ల రూపాయలు జరిగినట్టు ఈడీ అంచనా వేసింది. నకిలీ ఇన్ వాయిస్ లు, పెంచిన బిల్లుల మూలంగా కిక్ బ్యాక్ లు అందినట్టు ఈడీ గుర్తించింది. షెల్ కంపేనీలతో లావాదేవిలు జరిగినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఎపి ఎక్సైజ్ డిపార్ట్ మెంట్, ఐటీ శాఖ సోదాల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.ఈడీ దాడుల్లో పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లను ఆధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ లాలాదేవీల రికార్డులు అధికారులకు లభ్యమయ్యాయి. ఈ దాడులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. హవాలా మార్గంలో వందలాది కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తుసంస్థ గుర్తించింది. వైకాపా హాయంలో లిక్కర్ స్కాం జరిగినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎపిలో టిడిపి అధికారంలో ఉంది. ఎన్ డిఏ భాగస్వామ్య పార్టీగా ఉన్న టిడిపి లిక్కర్ స్కాం కేసులో సీరియస్ గా ఉంది.

Read More
Next Story