బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెడకు భూదాన్ భూముల స్కామ్ ఉచ్చు..
x

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెడకు భూదాన్ భూముల స్కామ్ ఉచ్చు..

తెలంగాణ భూదాన్ భూముల స్కామ్ కేసు మరో మలుపు తీసుకుంటి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆనాటి కలెక్టర్ అమోయ్‌కుమార్‌ను ఈడీ విచారించింది.


తెలంగాణ భూదాన్ భూముల స్కామ్ కేసు మరో మలుపు తీసుకుంటి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆనాటి కలెక్టర్ అమోయ్‌కుమార్‌ను ఈడీ విచారించింది. ఆయన విచారిస్తున్న ఈడీ.. ఆయనతో పాటు దిగువస్థాయి అధికారులు ఆర్డీఓ, తహశీల్దార్ వంటి వారిని కూడా అందరినీ ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా తాజాగా మరో నలుగురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి సహా ఇద్దరు బిల్డర్లు ఉన్నారు. వారిని ఈ నెల 16న విచారణకు రావాల్సిందిగా ఈడీ కోరింది. ఆమోద డెవలపర్స్‌కు చెందిన సూర్య తేజ సహా కేఎస్ఆర్ మైన్స్‌కు చెందిన సిద్ధారెడ్డి ఈ స్కామ్ ద్వారా భారీగా లాభపడ్డారని ఈడీ గుర్తించింది. వీరిని విచారించిన తర్వాత మరికొందరికి ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

అసలేంటీ స్కామ్..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో 50 ఎకరాల భూదాన్ భూమి అన్యాక్రాంతమైంది. ఆ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. సర్వే నెంబర్ 181, 182లోని వంద ఎకరాల భూమిపై కూడా కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అందులో 50 ఎకరాల భూమి తమకు చెందినదిగా భూదాన్ బోర్డ్ వాదిస్తోంది. ఆ భూములు కాలక్రమేణా చేతులు మారుతూ వస్తూ చివరికి 2021లో హజీఖాన్ వారసురాలిని తానేనంటూ ఖాదురున్నీసా అనే మహిళ దరఖాస్తు చేసు8కుంది. దాంతో ఆ భూములు ఆమె పేరు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ ప్రక్రియ శరవేగంగా జరిగింది. ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. కోర్టు ఆదేశాలతో ఈ భూ వివాదాలపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ వివాద భూమి ద్వారా ఎవరెవరు లబ్ది పొందారు అన్న వివారాలు సేకరించడం కోసం ఈడీ విచారణ చేస్తోంది.

ఇందులో భాగంగానే అప్పటి కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్, ఆర్‌ఐ అధికారులను ఇప్పటికే ఈడీ విచారించింది. కొందరు అధికారులు సదరు మహిళకు అనుకూలంగా పనిచేసినట్లు గుర్తించింది. ఈడీ. ఆ తర్వాత ఆ భూములు రియల్ ఎస్టేట్ సంస్థ చేతికి వెళ్లినట్లు నిర్ధారితమైంది. ఈ భూములను సొంతం చేసుకోవడానికి భారీగా ఆర్థిక లావేదీలు జరపడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ విచారణలో భాగంగానే తాజాగా మాజీ ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డి సహా రియల్ ఎస్టేట్ బిల్డర్లను విచారించాలని వారికి నోటీసులు జారీ చేసింది.

Read More
Next Story