లిక్కర్ స్కాంలో ముదురుతున్న కవిత కష్టాలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో పేరు వెలుగులోకి వచ్చింది. కవిత బంధువుపై ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.
కవిత మెడకు ఢిల్లీ లిక్కర్ స్కాం ఉచ్చు బిగుస్తోంది. తప్పించుకోలేని విధంంగా కవితకు అన్ని దార్లను ఈడీ మూసేస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా అష్టదిగ్బంధనం చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కవిత బంధువులపై కూడా ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ ధర్మాసనం ముందు ఉంచింది. ఈ కుంభకోణం కేసులో కవితతో పాటు ఆమె మేనల్లు మేక శరణ్ పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మేక శరణ్ పేరును కూడా లిస్ట్‌లో చేర్చనున్నట్లు తెలిపింది. ఇప్పటికే విచారణకు హాజరుకావాలని శరణ్‌కు రెండు సార్లు నోటీసులు జారీ చేశామని, అయితే అతడు స్పందించలేదని ఈడీ న్యాయాస్థానానికి వెల్లడించింది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అతి త్వరలోనే మరో కీలక మలుపు సంభవించనున్నట్లు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో శనివారం దాదాపు 11 గంటల పాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వీటిలో భాగంగా లిక్కర్ స్కాంలో కవిత మేనల్లుడు మేక శరణ్ పాత్రపై ప్రశ్నించారు ఈడీ అధికారులు. అఖిలకు సంబంధించిన 3 సంవత్సరాల ఆర్థిక లావాదేవాల గురించి, బ్యాంకు ఖాతాలు, ల్యాండ్ పత్రాలు, బంగారం సహా పలు ఇతర వివారలను కూడా వారు అడిగారు. అనంతరం అఖిల వాళ్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.