
బిసీ బిల్లు వచ్చే వరకు ఎన్నికలు జరపొద్దు
బిసి ప్రతినిధుల సభలో వకుళాభరణం
చట్ట బద్దత లేకుండా, ఎలాంటి గణాంకాలు లేకుండా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఎలా సాధ్యమని తెలంగాణ బిసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామి ఇచ్చిందని, ఆ హామి అమలు కాకమునుపే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం అంటే బీసీలను మోసం చేసినట్టేనని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అవసరమే కానీ హామీలు అమలయ్యే వరకు కాలయాపన చేయాలని వకుళాభరణం సూచించారు.
హైద్రాబాద్ లో జరిగిన బిసి ప్రతినిధుల సభలో వకుళాభరణం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని కలిసేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం పంపాలని డిమాండ్ చేశారు.ఇప్పటికీ రాష్ట్రపతి ఆమోదం పొందని బిల్లుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించలేదని ఆరోపించారు. అఖిలపక్ష నాయకులతో కలసి వెంటనే రాష్ట్రపతిని కలవాలన్నారు.త మిళనాడు, మహారాష్ట్ర ఉదాహరణలతో మరింత గడువు అవసరమన్నారు.
హైకోర్టు ఇచ్చిన గడువును ఎన్నికల షెడ్యూలుగా కాకుండా, కోర్టులో లార్జర్ బెంచ్‌ను ఆశ్రయించి మరింత సమయం కోరాలని సూచించారు.
“ప్రజాస్వామ్యంలో హామీలు అమలుకాకుండా ఎన్నికలు జరిపితే, అది మోసమే. ప్రభుత్వం చిత్తశుద్ధితో న్యాయబద్ధంగా ముందుకు వచ్చినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది.” అని వకుళాభరణం అన్నారు.