తెలంగాణ ఎలెక్టోరల్ బాండ్ల మహారాజు కెసిఆర్...
x

తెలంగాణ ఎలెక్టోరల్ బాండ్ల మహారాజు కెసిఆర్...

దేశంలో రెండో అతి పెద్ద వితరణశీలి మేఘా ఇంజనీరింగ్. ఇది తెలుగు వారి కంపెనీ. తెలంగాణలో వేళ్లూనిన ఈ కంపెనీ కెసిఆర్ కు ఎంత విరాళం ఇచ్చిందంటే..


హైదరాబాద్ : ఎన్నికల బాండ్ల దేశంలోని ప్రధాన లబ్దిదారులలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి(బీఆర్ ఎస్ ) ఒకటి. బాండ్లతో ఈ పార్టీ దేశంలోనే సంపన్నమయిన పార్టీ అయింది. పుట్టి 20 యేళ్లు కానీ , ఈ పార్టీకీ ప్రభుత్వం లో పట్టమని పదేళ్లు కూడా లేని ఈ పార్టీకి ఎన్ డిఎ ప్రభుత్వం ప్రకటించిన ఎలెక్టోరల్ బాండ్ల తో నోట్ల వరద వచ్చిపడింది. దేశంలో వ్యాపారస్థుల నుంచి అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీల్లో బీఆర్‌ఎస్‌ నాలుగవదిగా గుర్తింపు పొందింది.

ఎన్నికల బాండ్ల రూపంలో ఆ పార్టీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.1,322 కోట్లు. ఈ ఫిగర్ చూస్తే ఈ పార్టీ మీద కాంట్రాక్టర్లకు, ఆసుప్రతుల వాళ్లకు... ఎందుకింతప్రేమో అర్థం కాని అయోమయంలో పడిపోతారు.

చాలా సార్లు మాది రిచెస్ట్ పార్టీ అనే వారు కెసిఆర్. మా పార్టీకి వేయికోట్ల ఆస్తులున్నాయనే పచ్చినిజం చెప్పే వారు. దాని రహస్యం ఇదే. ఆయనకు వచ్చిన డబ్బంతా తెలంగాణ కాంట్రాక్టర్లు, ఐటి కంపెనీలు, ఆసుపత్రుల నుంచి వచ్చిందని ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ తెరిస్తే తెలుస్తుంది.

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సమర్పించిన వివరాల ప్రకారం బిఆర్ ఎస్ ను సంపన్న పార్టీ చేసిన కంపెనీలు జాబితా పెద్దదే. ఈ కంపెనీలలో కొన్ని. మేఘా ఇంజనీరింగ్‌ (201 కోట్లు) యశోదా హాస్పిటల్స్ (94), చెన్నై గ్రీన్ వుడ్స్ (50) డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ (32), హెటిర్ డ్రగ్స్ )30), ఐఆర్ బి ఎంపి ఎక్స్ ప్రెస్ వేస్ (25), ఆనర్ ల్యాబ్స్ (25), ఎన్ ఎస్ ఎల్ ఎస్ ఇ జడ్ (24.5 ) ఎల్ 7 హైటెక్ (22) ఇతరులు (693).

కెసిఆర్ పార్టీకి అందిన విరాళాలలో సగానికిపైగా అంటే రూ.663 కోట్లు ( 50.15 శాతం) నాలుగు రోజుల్లోనే వచ్చనట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్ కు అందించిన సమాచారం ఉంది. ఈ సమాచారం ఎన్నికల కమిషన్ వైబ్ సైట్లోభద్రంగా ఉంది. ఈ మొత్తంలో కూడా రూ.268 కోట్ల విలువైన బాండ్లు ఒకే రోజున తెలంగాణ భవన్ లో వచ్చిపడ్డాయి. 2022 ఏప్రిల్‌ 12న.. బీఆర్‌ఎస్ బొక్కసంలో పడిన బాండ్ల విలువ రూ.268 కోట్లు. అంటే ఏప్రిల్ 22 బిఆర్ ఎస్ కు పండగ. అలాగే, 2023 జూలై 13న రూ.218 కోట్లు, 2022 ఏప్రిల్‌ 11న రూ.92 కోట్లు, 2021 అక్టోబరు 8న రూ.85 కోట్లు ఆ పార్టీకి విరాళాలుగా వచ్చినట్లు స్టేట్ బ్యాంకు సమాచారం వల్ల తెలుస్తుంది. తెలుగు రాజకీయ పార్టీలన్నంటికి ఆప్త మిత్రుడయిన మేఘా కంపెనీ నుంచి కెసిఆర్ అదే బిఆర్ ఎస్ అందుకున్న మొత్తం రు, 201. ఎవరు అధికారంలో ఉన్నా ఈ కంపెనీని విస్మరించడం కష్టం.

అన్నీ అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చిన నిధులే

బాండ్ల తేదీలను బట్టి చూస్తే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందే వచ్చాయని అర్థమవుతుంది. 2023 జూలై , అక్టోబర్ మధ్యనే వచ్చాయి. ఉదాహరణకు కేరళకు చెందిన కైెటెక్స్ కంపెనీ నుంచి బిఆర్ ఎస్ కు రు. 25 కోట్లు అందాయి. దీని వెనక రహస్యం ఏమిటి? వరంగల్ జిల్లాలో గీసుకొండ మండ ల్ ఈ కంపెనీకి ప్రభుత్వం 187 ఎకరాల భూమిని ఇచ్చింది. ఇది జరిగిన వెంటనే విరాళం అందింది. నిజానికి ఈ చర్యకు వ్యతిరేకంగా రైతులు అక్కడ పెద్ద పోరాటమే చేశారు. రైతులను కాదని కంపెనీకి భూములు ఇచ్చిన కెసిఆర్ పార్టీ భారీ విరాళాలు స్వీకరించి సంపన్నమయిన పార్టీ అయింది. ఇలా కెసిఆర్ పార్టీకి అందిన ప్రతి బాండ్ కు ఏదో ఒక ప్రభుత్వం పైరవీ లింక్ కనిపిస్తుంది, జాగ్రత్తగ చూస్తే.

కంపెనీల విషయానికి వద్దాం

దేశంలో అత్యధిక పార్టీలకు డబ్బు పందేరం చేసిన కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ. ఇది 1368 కోట్ల విలువయిన బాండ్లను పార్టీలకు అందించింది. ఎక్కువ అందుకున్నది ఎప్పటిలాగానే బిజెపియే. ఇక రెండో పార్టీ తెలుగు వాళ్ల మేఘా ఇంజనీరింగ్ (ఎంఇఐఎల్). ఈ కంపెనీ నుంచి భారీగా విరాళాలు పొందింది కూడా బిజెపియే. ఆ పార్టీకి ఏకంగా 584కోట్లు ముట్ట చెప్పారు. తర్వాతి స్థానం కెసిఆర్ పార్టీ దే. ఈ పార్టీ కి అందిన సొమ్ము 195 కోట్లు.

ఈ కంపెనీ నుంచి దాదాపు అన్ని పార్టీలు అంతో ఇంతో తీసుకున్నాయి. మేఘా మూడో పెద్ద లబ్దిదారు ఆంధ్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ (వైసిపి). ఈ పార్టీకి 37 కోట్లు అందాయి. ఇక ఇతర లబ్దిదారుల్లో కాంగ్రెస్ (84 కోట్లు), టిడిపి (25),జెడిఎస్, జెడియు వగైరాలు ఉన్నాయి. వీళ్లకి అయిదు నుంచి పది కోట్ల లోపు బాండులందాయి.

ఇంత పెద్ద మొత్తం ఉన్న బాండ్లు పోస్టులో రావు, కొరియర్ లో రావు. ఎవరో ప్రముఖుడే వచ్చి ఉంటాడు. వచ్చిన వాడు ఎవరు పంపితే వచ్చాడో చెప్పకుండా కోట్లు చేతిలో పెట్టడు.

జగన్ కు అందిన సాయం

ఆంధ్ర ప్రదేశ్ లోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ గేమింగ్ సంస్థనుంచి రు. 154 కోట్ల విలువయిన బాండ్లు అందాయి. మేఘా నుంచి 34 కోట్ల విలువయిన బాండ్లు అందితే, రామ్ కో నుంచి 24 కోట్లు, ఆస్ట్రో జై సల్మేర్ నుంచి 17కోట్లు, ఒస్ట్రో మధ్య విండ్స్ నుంచి 17కోట్లు, కైనెటిక్ పవర్ ప్రాజక్ట్స్ నుంచి 10 కోట్లు అందాయి. ఇతర చిన్న చిన్న కంపెనీల నుంచి 69.8 కోట్ల విలువయిన బాండ్లు దొరికాయి.

తెలుగుదేశం పార్టీకి అందిన బాండ్లు

ఆంధ్రప్రదేశ్ అధికారంకోసం విపరీతంగా శ్రమపడుతున్న చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి కూడా బాగానే విరాళాలు అందాయి. షిర్డి సాయి ఎలెక్ ట్రికల్స్ సంస్థ నుంచి 40 కోట్ల విలువయిన బాండ్లు అందితే,ర మేఘా ఇంజనీరింగ్ నుంచి 37 కోట్లు వచ్చిపడ్డాయి. ఇతర కంపెనీలో యుపి పవర్ ట్రాన్స్ కో (20), నాట్కో ఫార్మ (14) డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (13) భారత్ బయో టెక్ (10) అందాయి. ఇతర కంపెనీల నుంచి మరొక రు. 86.6 కోట్ల విలువయిన బాండ్లు అందాయి.


Read More
Next Story