హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ కారు దగ్దం
x

హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ కారు దగ్దం

షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదమని అనుమానం


హైదరాబాద్ ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది.. ఆదివారం అకస్మాత్తుగా మంటలు. చెలరేగి ఓ ఎలక్ట్రిక్‌ కారు పూర్తిగా దగ్దమైంది. పక్కనే మరో కారు ఉండటంతో అది పాక్షికంగా కాలిపోయింది. భారీగా పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాంధీనగర్‌, దోమలగూడ ట్రాఫిక్‌ పోలీసులు అక్కడికి చేరుకొని వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్ల ప్రమాదాలకు సంబంధించి నిర్దిష్ట గణాంకాలు లేవు, కానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. . కొన్ని సంఘటనలు వేగంగా డ్రైవింగ్ చేయడం వల్ల లేదా విద్యుత్ స్తంభాలను ఢీకొట్టడం వల్ల అడపా దడపా జరుగుతున్నాయి. అలాగే, ఒక ఘటనలో విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు చనిపోయారు, కానీ అది కారు ప్రమాదం కాదు. ఎలక్ట్రిక్ కార్లు కూడా ఇతర కార్ల లాగే తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎల్బీ స్టేడియం వద్ద ఎలక్ట్రిక్ కారు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read More
Next Story