‘కవిత అసంతృప్తి.. బీఆర్ఎస్ పతనానికి నిదర్శనం’
x

‘కవిత అసంతృప్తి.. బీఆర్ఎస్ పతనానికి నిదర్శనం’

బీఆర్ఎస్‌లో తన పాత్రను మరిచిపోతున్నారన్న భావన కవితకు కలిగింది.


ప్రస్తుతం తెలంగాణ అంతటా హాట్‌టాపిక్ ఉన్న విషయం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్‌లో లుకలుకలే. కవిత వర్సెస్ బీఆర్ఎస్ అన్న వాదన రోజురోజుకు బలం పుంజుకుంటుంది. కాగా ఇక్కడ కవిత అసంతృప్తి ఎవరిపైన అనేది మాత్రం క్లారిటీ రాలేదు. బీఆర్ఎస్‌లో వస్తున్న ఈ పరిణామాలపై తాజాగా బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటగా స్పందించారు. కవిత అసంతృప్తి బీఆర్ఎస్ పతనానికి నాంది అంటూ వ్యాఖ్యానించారు. ఆమె అసంతృప్తి కొంతకాలంగా అనేక సందర్భాల్లో బయటపడుతూనే ఉందని, తాజాగా లేఖతో అది బహిరంగమయిందని అన్నారు. బీఆర్ఎస్‌లో తన పాత్రను మరిచిపోతున్నారన్న భావన ఆమెకు కలిగిందని, కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినట్లే తనకూ ఇవ్వాలని ఆమె కోరుకుంటుందని, కానీ అది జరగకపోవడంతో ఆవేదనకు గురవుతుందని ఆయన అన్నారు.

‘‘ట్రబూల్ షూటర్‌గా గుర్తింపు పొందిన కేసీఆర్ ఇప్పుడు స్వయంగా ట్రబుల్స్‌లో కూరుకుపోయి ఉన్నారు. ఆయన ట్రబుల్స్‌లో పార్టీ క్యాడర్ సందిగ్దంలో ఉంది. కేసీఆర్‌పై పార్టీ కార్యకర్తల్లో నమ్మకం రోజురోజుకు సన్నగిల్లుతోంది. ఆ విషయం గురించి కవిత మాట్లాడుతున్నారు. అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనమవుతుంది. అందులోని మచ్చలేని నేతలంతా ఇప్పుడు బీజేపీ వైపే చూస్తున్నారు. BRS నాలుగు స్తంభాలాటల మధ్య కూలిపోబోతోంది. పదవులు, ఆస్తుల కోసమే అంతర్గత పోరు నడుస్తోంది. కవిత కూడా పార్టీ నుండి బయటకు వెళ్లాలని చూస్తున్నారు,” అన్నారు.

Read More
Next Story