
Encounter| ములుగు అడవుల్లో అలజడి
పోలీసుల ఎన్‌కౌంటర్, ఏడుగురి మావోయిస్టుల మృతి
పచ్చని చెట్లు, దట్టమైన అడవులతో అలరారుతున్న ఏటూరు నాగారం అడవులు ఆదివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ (Encounter)తో రక్తసిక్తమైంది. ప్రశాంతమైన అటవీ గ్రామాల్లో భారీ ఎన్‌కౌంటర్ ఘటనతో ప్రశాంతత చెదిరింది.
- ఆదివారం తెల్లవారుజామున ఏటూరునాగారం (forests of Eturu Nagaram)మండలం చెల్పాక అడవుల్లో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్ సాయుధ పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. (seven Maoists killed)
- ఈ కాల్పుల్లో నర్సంపేట ఏరియా కార్యదర్శి బద్రు మృతి చెందినట్లు చెబుతున్నారు. నర్సంపేట ఏరియా కార్యదర్శి బద్రు తలపై ఇరవై లక్షల రూపాయల రివార్డు ఉంది. ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశంలో రెండు ఏకే -47 రైఫిల్స్, పేలుడు పదార్థాలు దొరికాయని పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టుల కదిలికల నేపథ్యంలో అటవీ గ్రామాల్లో వాహనాల తనిఖీలు చేయడంతోపాటు మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్ బలగాలను పోలీసులు రంగంలోకి దించారు.మృతుల్లో ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు(43),ముస్సకి జమున(23), జైసింగ్ (25),కిశోర్ (22),కామేష్ (23), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22) ఉన్నారు.పోలీసులు మరణించిన మావోయిస్టుల ఫొటోలను విడుదల చేశారు.
ఇద్దరు పోలీసు ఇన్ ఫార్మర్ల నెపంతో హత్య
వరుస ఎన్ కౌంటర్లు