వాణిజ్య ప్రయోజనాలకు మూసీ ప్రాజక్టు చేపట్ట వద్దు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న మూసీ ప్రాజక్టుల మీద మేధావుల బహిరంగ లేఖ
మూసీ పునరుజ్జీవన మెగాప్రాజెక్ట్ ప్రారంభం సందర్భంగా తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు, ఉద్యమకారులు, విద్యావేత్తలు ప్రతిపాదిత ప్రాజెక్టుపై ఆందోళనకు దిగారు.ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల మూసీ నదీ గర్భం వెంట నివాసముంటున్న పేద ప్రజల పునరావాసంపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.
- మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రజలతో సంప్రదింపులు జరిపి వారికి మేలు జరిగేలా, పర్యావరణహితంగా మార్చాలని నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్,నేషనల్ ఫోరమ్ ఆఫ్ అర్బన్ స్ట్రగుల్స్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కోరాయి.
ప్రైవేటీకరణ ప్రాజెక్టు కాకూడదు...
మూసీ పునరుజ్జీవన మెగా ప్రాజెక్టు భూసేకరణ, ప్రైవేటీకరణ ప్రాజెక్టు కాకూడదని ఉద్యమకారులు సంతకాలు చేసిన లేఖలో డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టును పునరావాసం లేకుండా చేపట్టకూడదని పర్యావరణవేత్తలు, విద్యావేత్తలు కోరుతున్నారు. మెగా ప్రాజెక్టు ముసుగులో అడవులు, వ్యవసాయ భూములను మళ్లించవద్దని వారు సూచించారు. పారిశ్రామిక, మున్సిపల్ మురుగునీటి కాలుష్యాన్ని నిర్మూలించడం ద్వారా పర్యావరణ హిత నీటి ప్రవాహాన్ని మూసీలో ఉండేలా చూడాలని కోరారు.
మూసీ నివాసితులకు పునరావాసం కల్పించాలి
మూసీ నది ప్రాంతంలోని నివాసితులందరికీ గౌరవప్రదమైన డబుల్ బెడ్రూం గృహాలు ఇచ్చి, వారికి జీవనోపాధి,వారి పిల్లలకు విద్య అందించాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేశారు. ఏకపక్షంగా కూల్చివేసిన ఇళ్ల యజమానులకు కల్పించాలని మేధావులు కోరారు.మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు వల్ల సామాన్యులకు, నదీతీర ప్రజలకు అతి తక్కువ నష్టం వాటిల్లేలా చూడాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేశారు.
భూసేకరణ చేపట్టొద్దు
ఇళ్లను మూసీ ప్రాజెక్టు పేరిట అనవసరంగా తొలగించవద్దని, భూసేకరణలకు దూరంగా ఉండాలని, వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టవద్దని పర్యావరణ వేత్తలు లేఖలో ఉద్ఘాటించారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి పలువురు పర్యావరణ వేత్తలు, విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు.
పర్యావరణ వేత్తల బహిరంగ లేఖ
ఈ లేఖలో మేధా పాట్కర్, సౌమ్య దత్తా, డాక్టర్ కె. బాబు రావు, లలితా రాందాస్, ప్రఫుల్ల సమంతా, జస్వీన్ జైరత్ సహా ప్రముఖ కార్యకర్తలు ఉమ్మడి బహిరంగ ప్రకటనపై సంతకాలు చేశారు. తెలంగాణలో సామాజిక న్యాయం, సమ్మిళిత పాలన అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మూసీ ప్రాజెక్టు వల్ల నష్టం జరగకుండా చూడాలని మేధావులు సూచించారు.
Next Story