‘కేసీఆర్ ఓ చక్రవర్తిలా ప్రవర్తిస్తారు’
x

‘కేసీఆర్ ఓ చక్రవర్తిలా ప్రవర్తిస్తారు’

కేసీఆర్ తనను తాను చక్రవర్తిలా భావిస్తారు. ఆయనను ఎవరూ ప్రశ్నించకూడదు.


కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అన్ని పార్టీల వాళ్లు కూడా ఈ లేఖ గురించే మాట్లాడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన బీజేపీ నేత ఈటల రాజేందర్ మాత్రం కేసీఆర్ ప్రవర్తన గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. కేసీఆర్‌తో కలిసి పనిచేయడం అంటే పూర్తిగా ఆయనను అనుసరించాల్సిందేనని చెప్పారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానిని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందేనని, ఆచరించాల్సిందేనని ఈటల చెప్పుకొచ్చారు. మనుషుల విషయంలో కూడా కేసీఆర్ అంతే ప్రవర్తిస్తారని, ఒక్కసారి ఆయన మనసులో ఎవరిపైన అయినా నెగిటివ్ ఫీల్ వస్తే.. ఇక అది అంతే ఉంటుందని, దానిని పోగొట్టడం కష్టమని అన్నారు. ‘‘కేసీఆర్ తనను తాను చక్రవర్తిలా భావిస్తారు. ఆయనను ఎవరూ ప్రశ్నించకూడదు. ఆయన చర్యలను విమర్శించకూడదు. ఆయన మాటే శాసనం, ఆయన పక్కన ఉండటం అంటే పూర్తిగా ఆయన్ని అనుసరించాల్సిందే. విమర్శలను ఆయన అస్సలు సహించరు. అతని పాలన రాచరికపు ధోరణిలో ఉంటుంది. ఆయన తనను నమ్మిన వారినే అవసరానికి వినియోగించుకుని తర్వాత వదిలేస్తారు కేసీఆర్. ఆయన రాజకీయంగా కుదేలవడానికి కూడా ఇదే కారణం. కవిత విషయంలో కల్వకుంట్ల కుటుంబంలో ఏదో తేడా వచ్చింది. వాళ్లు మళ్ళీ కలవడం చాలా కష్టం’’ అని ఈటల చెప్పుకొచ్చారు. దాదాపు 20 ఏళ్ల పాటు కేసీఆర్‌తో కలిసి పనిచేసిన అనుభవంతోనే తాను ఈ మాటలు చెప్తున్నానని అన్నారు.

Read More
Next Story