ఎక్కడ చూసినా రేవంత్..రేవంత్...రేవంత్
అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన రేవంత్ రెడ్డి మానియా పార్లమెంటు ఎన్నికల్లో కూడా కంటిన్యు అవుతోంది. ఏ ప్రతిపక్ష నేత మాట్లాడినా రేవంత్ నే ఎటాక్ చేస్తున్నారు.
ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన రేవంత్ రెడ్డి మానియా పార్లమెంటు ఎన్నికల్లో కూడా కంటిన్యు అవుతోంది. ఏ ప్రతిపక్ష నేత మాట్లాడినా రేవంత్ నే ఎటాక్ చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షనేతలందరికి ఒకరే టార్గెట్, అదే రేవంత్. బీఆర్ఎస్ త్రిమూర్తులు కేసీయార్, కేటీయార్, హరీష్ రావు, బీజేపీలో జీ కిషన్ రెడ్డి మొదలుకుని బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఏలేటి మహేశ్వరరెడ్డి, రఘునందనరావుకు ప్రతిరోజు రేవంత్ ను టార్గెట్ చేయనిదే రోజుగడవటంలేదు. బహిరంగభ కావచ్చు, రోడ్డుషో, ర్యాలీ చివరకు స్ట్రీట్ కార్నర్ మీటింగులో కూడా అందరు రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇంతమంది ఇన్నిరకాలుగా ఒక్కడిని టార్గెట్ చేస్తున్నారంటేనే రేవంత్ వాళ్లందరికి ఎంతకలవర పెడుతున్నాడో అర్థమవుతుంది.
ఒక ఏడాది కిందటి దాకా రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడని ఎవరూ వూహించి ఉండరు. భారత్ రాష్ట్ర సమితి నేత రేవంత్ అనే వ్యక్తిని గుర్తించే స్థితిలో కూడా లేడు. కాబట్టి రేవంత్ ముఖ్యమ ంత్రి అవుతాడని కలలో కూడా బిఆర్ ఆర్ త్రిమూర్తులు వూ హించి వుండరు. ఆయన ప్రణాళిక మొత్తం తెలంగాణలో ముఖ్య మంత్రి అంటే కెసిఆర్, ఆ పైన కెటిఆర్, ఆపైన కెటిఆర్ మనవడు ఇలా సాగిపోయింది తప్ప మరొకవ్యక్తిని ఆ పోస్టులో వూహించుకునే స్థితియే లేదు. రేవంత్ ప్రస్తావన వచ్చినపుడుల్లా కెసిఆర్ ఎలా తృణీకరించేవాడో టివి చూస్తున్నవాళ్లంతా గ మనించి ఉంటారు. ఇక బిజెపిలో కూడ అంతే, ముఖ్యమంత్రి అంటే బండి సంజయ్, ఈటలరాజేందర్, కిషన్ అని భావించుకున్నారే తప్ప కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి తయారవుతాడని, అది కూడా రెవంత్ అవుతాడని కలలో కూడా వాళ్లు వూహించి ఉండరు. దానికితోడు ఒక వైపు కెసిఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు డెత్ సర్టిఫికేట్ ఇస్తూనే వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ ముఖ్యమంత్రి అయితే, ప్రత్యర్థులు సాఫీగా ఆలోచించే సామర్థ్యం కోల్పోక తప్పదు. అందుకే రేవంత్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినుంచి అదిగో పడిపోతాడు, ఇదిగోపడిపోతాడనే తప్ప మరొక మాటే లేదు.
చాలామంది నేతల్లాగ వారసత్వంతోనో లేకపోతే అదృష్టవశాత్తో రాజకీయాల్లో పైకి ఎదిగి ముఖ్యమంత్రి కాలేదు. కష్టపడి అనేకమంది ప్రత్యర్ధులను ఎదుర్కొని చాకచక్యంతో అవసరానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటే డక్కామొక్కీలుతిని ఎదిగిన నేత. గ్రూపులకు నిలయమైన కాంగ్రెస్ లో చేరిన ఐదేళ్ళల్లోనే ముఖ్యమంత్రి అయిపోయాడంటేనే రేవంత్ కెపాసిటి ఏమిటో అర్ధమైపోతోంది. కాంగ్రెస్ తో పాటు అన్నీ పార్టీల్లో కలిపి క్రౌడ్ పుల్లర్లు ఎంతమంది ఉన్నారని చూస్తే రేవంత్, కేసీయార్ తప్ప మరొకళ్ళు కనబడరు. ఈ ఇద్దరిలో కూడా రేవంతే నెంబర్ వన్ చెప్పవచ్చు. చెప్పదలచుకున్నది సూటిగా సుత్తిలేకుండా చెప్పటం, విషయ పరిజ్ఞానం ఉండటం, జనాలకు ఆకట్టుకునే వాగ్ధాటి ఉండటం రేవంత్ కు పెద్ద ప్లస్ పాయింటని చెప్పాలి.
టీడీపీలో నుండి కాంగ్రెస్ లో చేరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నాటినుండే రేవంత్ పైన కేసీయార్, కేటీయార్, హరీష్ టార్గెట్ మొదలైంది. ఎందుకంటే కేసీయార్ కు నిజమైన, ధీటైన ప్రత్యర్ధి రేవంత్ మాత్రమే అని వీళ్ళముగ్గురికి తెలుసు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానకారణం రేవంత్ అని చెప్పటంలో అతిశయోక్తిలేదు. ఎందుకంటే స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరినతర్వాతే జవసత్వాలు వచ్చాయి. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఎంతమందున్నా రేవంత్ పార్టీలో చేరటంతోనే విపరీతమైన చలనం మొదలైంది. ఆ చలనంతోనే కేసీయార్ డౌన్ ఫాల్ మొదలైంది. అందుకనే తమలోని అక్కసునంతా త్రిమూర్తులు రేవంత్ ను టార్గెట్ చేయటంలోనే తెలిసిపోతోంది. రేవంత్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని ఒకరు, లోక్ సభ ఎన్నిక లవుతూనే రేవంత్ పతనం మొదలవుతుందని మరొకరు, ఒక ఏడాదికంటే రేవంత్ ప్రభుత్వం కొనసాగది ఇంకొకరు రేవంత్ పతనం కాంక్షిస్తున్నారు.రేవంత్అంతకు మించి కొనసాగితే తమ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని వీళ్లంతా భయపడుతున్నారా?
ఇక బీజేపీ విషయానికి వస్తే కిషన్, బండి, రఘునందన్ ఇలా ప్రతిఒక్కరు ప్రతిరోజు రేవంత్ జపమే చేస్తున్నారు. తమ ఆరోపణలు, విమర్శలన్నింటినీ రేవంత్ ప్రధానంగానే చేస్తున్నారు. త్రిమూర్తులైనా, కమలంపార్టీ నేతలైనా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని, పార్టీని రేవంత్ చీల్చేస్తాడని, రేవంత్ తెలంగాణా షిండే అయిపోతాడని పదేపదే గోలగోల చేస్తున్నారు. ఆమధ్య నిజామా బాద్ ఎంపి ధర్ముపురి అర్వింద్ మాటాడతు రేవంత్ లో టాలెంట్ ఉందని, ఆయన చక్కగా బిజెపిలోకి రావచ్చని ఆహ్వానించారు. ఇంతమంది ప్రత్యర్ధులు కలిసి ఒక్క రేవంత్ ను పదేపదే టార్గెట్ చేయటంతోనే తాము కాంగ్రెస్ కు ఉచిత ప్రచారం చేస్తున్నామని గ్రహించలేకపోతున్నారు. మరి ఫలితాలు ఎలాగుంటాయో చూడాలి.