
11 కేంద్రాల్లో మోరాయించిన ఈవీఎంలు
వెంటనే అధికారులు రిజర్వ్ ఈవీఎంలను రీప్లేస్ చేశారు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ప్రశాంతంగా మొదలైంది. ఓటర్లు పెద్దఎత్తున బారులుతీరారు. 7 డివిజన్లలోని 407 పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. అయితే బోరబండ, రహమత్ నగర్, షేక్ పేట డివిజన్లలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. సడన్ గా ఈవీఎంలు పనిచేయటం మానేశాయి. ఒకవైపు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తుండగా మరోవైపు కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటం గమనార్హం. వెంటనే అధికారులు రిజర్వ్ ఈవీఎంలను రీప్లేస్ చేశారు. ఈసీఐఎల్ అధికారులు, నిపుణులు ఈవీఎంల పనితీరును పరీక్షిస్తున్నారు. బోరబండలోని నవోదయ స్కూలు పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే యూసుఫ్ గోడ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్ ఓటు వేశారు.
కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్నన్ చెప్పారు. అధికారులు వెంటనే ఈవీఎంలను రీప్లేస్ చేసినట్లు తెలిపారు. ఓటర్లందరు పెద్దఎత్తున ఓటింగ్ లో పాల్గొని తమ హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు.

