డ్రగ్స్ తో మాజీ చీఫ్ సెక్రటరీ కొడుకు అరెస్టు
x
Drugs in Hyderabad

డ్రగ్స్ తో మాజీ చీఫ్ సెక్రటరీ కొడుకు అరెస్టు

ప్రభుత్వం ఎంతగట్టిగా ప్రయత్నిస్తోందో కొంతమంది వ్యక్తులుమాత్రం యధేచ్చగా డ్రగ్స్ ను రకరకాల మార్గాల్లో వినియోగదారులకు అందిస్తున్నారు.


తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం ఎంతగట్టిగా ప్రయత్నిస్తోందో కొంతమంది వ్యక్తులుమాత్రం యధేచ్చగా డ్రగ్స్ ను రకరకాల మార్గాల్లో వినియోగదారులకు అందిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక ఘటన పోలీసులనే షాక్ కు గురిచేసింది. విషయం ఏమిటంటే నగరంలో పెద్దఎత్తున డ్రగ్స్(Drugs) పట్టుబడింది. గచ్చిబౌలీ పరిధిలోని శరత్ సిటీమాల్ లో పెద్దఎత్తున డ్రగ్స్ చేతులు మారబోతోందని పోలీసులకు నమ్మకమైన సమాచారం అందింది. దాంతో మాల్ దగ్గరకు పోలీసులు పెద్దఎత్తున చేరుకుని అనుమానితుల కదలికలపై నిఘా ఉంచారు.

గంటలతరబడి అనుమానితులపై నిఘా ఉంచిన పోలీసులకు కొందరి కదలికలు అనుమానంగా అనిపించింది. వీరిలో కూడా ఒక యువకుడిపై పోలీసులు గట్టిగా దృష్టిపెట్టారు. కొద్దిసేపటికి సదరు యువకుడి కదలికలు మరింత అనుమానాస్పదంగా మారటంతో అతిడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతిడిని వెతికినపుడు భారీఎత్తున డ్రగ్స్ దొరికింది. నిందితుడు ఎక్కడినుండి వచ్చాడనే విషయాన్ని తెలుసుకున్న పోలీసులకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యింది.

ఎందుకంటే, డ్రగ్స్ తో పట్టుబడిన యువకుడిది ఉత్తరప్రదేశ్ అని తెలిసింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్(UttarPradesh) కు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి కొడుకన్న విషయం కూడా బయటపడింది. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి కొడుకు డ్రగ్స్ వ్యాపారంచేస్తు పట్టుబడ్డాడన్న విషయం ఇపుడు ఉన్నతాధికారి వర్గాల్లో సంచలనంగా మారింది. యూపీ నుండి యువకుడు హైదరాబాదు(Hyderabad)కు ఎప్పుడు వచ్చాడు ? ఎంతకాలంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో పోలీసులకు ఇంకెన్ని వివరాలు తెలుస్తాయో చూడాలి. ఇప్పటికైతే యువకుడు చెప్పిన సమాచారం ఆధారంగా మాజీ చీఫ్ సెక్రటరీ కుటుంబానికి ఫోన్ చేసి విషయాన్ని చేరవేశారు.

Read More
Next Story