దేవుడి పటాల వెనక గంజాయి పొట్లాలు
x

దేవుడి పటాల వెనక గంజాయి పొట్లాలు

ధూల్ పేటలో గంజాయి వ్యాపారి రోహన్ సింగ్ అరెస్ట్


సమాజంలో నేరస్వరూపాలు మారుతున్నాయి. కానీ నేరాలు మాత్రం ఆగడం లేదు. హైద్రాబాద్ ధూల్ పేట ఒకప్పుడు గుడుంబా వ్యాపారానికి అడ్డా. నేడు గంజాయి వ్యాపారానికి అడ్డాగా మారింది. గుడుంబాస్థానంలో గంజాయి వచ్చి చేరింది.

అన్ని రంగాల్లో క్రియేటివిటీ పెరిగినట్టే గంజాయి వ్యాపారంలో క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. దేవుడి చిత్రపటాల వెనక గంజాయి దాచిన వైనం ఇది. ధూల్ పేటకు చెందిన రోహన్ సింగ్ గంజాయి వ్యాపారీ. అనేక సార్లు పట్టుబడి జైలుపాలయ్యాడు. ఈ సారి మరికొంత జాగ్రత్తగా గంజాయి వ్యాపారం చేయాలనుకున్నాడు.

ఒరిస్సానుంచి గంజాయిని తీసుకొచ్చిన రోహన్ సింగ్ పదిమందికి చేరవేయాలనుకున్నాడు. తన వద్ద గంజాయి ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులకు ఉప్పందింది.

వెంటనే గంజాయి వ్యాపారి ఇంటికి చేరుకున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రోహన్ సింగ్ పూజలు చేస్తూ కనిపించాడు. ఎంతైనా పోలీసులు కదా అనుమానం వచ్చింది. ఇళ్లంతా వెతికారు . ఎక్కడా గంజాయి దొరకలేదు. ఓ వైపు ఎక్సైజ్ దాడులు చేస్తున్న సమయంలో రోహన్ సింగ్ ఇంట్లో పూజలు చేస్తూనే ఉన్నాడు. పోలీసులకు అనుమానం మరింత బలపడింది. పూజలు చేస్తున్న చిత్రపటాల వైపు అనుమానంగా చూశారు. పూజగదిలో సోదాలు చేశారు. చిత్ర పటాల వెనక గంజాయి కనిపించింది.

గంజాయిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటీవల ఈగల్ టీమ్ లను ఏర్పాటు చేసింది. గంజాయి ఎగుమతి, దిగుమతులు, గంజాయి మొక్కలను పెంచే వారిపై ఈగల్ టీమ్ ఉక్కుపాదం మోపుతుంది. గంజాయిని ఇట్టే పసిగడుతుంది. తాజాగా రోహిన్ సింగ్ కొత్త తరహాలో గంజాయి వ్యాపారం చేయాలనుకుని పట్టుబడ్డాడు.

Read More
Next Story