ఇండియా హ్యాండ్‌మేడ్ ఫెస్టివల్
x

ఇండియా హ్యాండ్‌మేడ్ ఫెస్టివల్

దేశీ పత్తిని ఉపయోగించి, సహజ రంగులతో త‌యారు చేసిన ఖాదర్ వస్త్రాల ప్ర‌ద‌ర్శ‌న‌


బంజారాహిల్స్‌లోని క్రాఫ్ట్ కౌన్సిల్‌లో ఏర్పాటు చేసిన ఇండియా హ్యాండ్‌మేడ్ కలెక్టివ్ (IHMC) ప్ర‌ద‌ర్శ‌న‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. శుక్ర‌వారం నాడు రిటైర్డ్ IAS అధికారి టి. విజయ్ కుమార్ లాంఛ‌నంగా ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్రారంభించారు. ఉద‌యం 11 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల 30 నిమిషాల వ‌ర‌కు సంద‌ర్శ‌కుల్ని అనుమ‌తిస్తున్నారు.

ఈ రోజు నుంచి ఆదివారం వ‌ర‌కు 3 రోజుల పాటు సంద‌ర్శ‌కుల‌కు, కొనుగోలుదారుల‌కు ఈ ప్ర‌ద‌ర్శ‌న అందుబాటులో వుంటుంది. "భార‌త‌దేశ సాంప్ర‌దాయ‌క పురాతన చేతిపనుల్ని పునరుద్ధరించడం, చేతితో వడిన, చేతితో నేసిన, సహజంగా రంగులు వేసిన దుస్తులకు ప్ర‌చారం క‌ల్పిస్తూ ఇండియా హ్యాండ్‌మేడ్ కలెక్టివ్ దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం చేస్తూ ప్రత్యేకమైన నేచురల్ డై హ్యాండ్‌మేడ్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోంది. స్వచ్ఛమైన ఖద్దర్ దుస్తులతో పాటు, అనేక ఇతర హస్తకళలు, చేతితో తయారు చేసిన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల్ని" ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో పెట్టారు.

దేశం నలుమూలల నుండి వచ్చిన చేతివృత్తుల కళాకారులు తమ చేతి ఉత్ప‌త్తుల్ని ప్రదర్శిస్తున్నారు. దేశీ పత్తి ని ఉపయోగించి చేసిన ఖాదర్ వస్త్రాలు, సహజ రంగాలను వాడి తయారు చేసిన వస్త్ర ఉత్పత్తుల్ని ఇక్క‌డ చూడ‌వ‌చ్చు.

"దయచేసి ప్లాస్టిక్ తో తయారు అయిన వస్త్రాలను వాడ వద్దు, అవి పర్యావరణానికి, మానవాళికి, పశుపక్ష్యాదులకు చాలా హానికరం అనే సందేశాన్ని ఈ ప్రదర్శన ఇస్తోంది. సంప్రదాయ పండుగలను నిజమైన సంప్రదాయ పద్ధతిలో తయారైన నూలు వస్త్రాలతో జరుపుకోవాలి," అని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి టి.విజ‌య్‌కుమార్ ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు.

"మహిళలు మరింత ఆర్థికంగా ఎదగాలి. సంఘటితంగా ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్య దేవరాజన్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. వాటిని జిల్లాస్థాయిల్లో ఏర్పాటు చేసే వివిధ ప్రదర్శన(ఎగ్జిబిషన్‌)లలో విక్రయిస్తున్నారు. ఆయా సంఘాల ఉత్పత్తుల కోసం రాజధానిలోనూ శాశ్వత విక్రయ కేంద్రాలను మహిళాశక్తి బజార్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం శిల్పారామంలో ప్రారంభించింది. మ‌హిళా సంఘాలు ముందుకు వ‌స్తే వారికి కూడా ఉచితంగా స్టాల్స్ కేటాయిస్తామం," అని దివ్య దేవరాజన్ చెప్పారు.

Read More
Next Story