పాశమైలారం ఘటనపై కమిటీ
x

పాశమైలారం ఘటనపై కమిటీ

సిగాచి చేరుకున్న కమిటీప్రతినిధులు


పాశమైలారం ఘటనలో 40 మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణలో అతిపెద్ద ప్రమాదం అని అధికారులు తేల్చేశారు. బ్లాస్ట్ జరిగి ఇంతమంది ఒకేసారి చనిపోవడం ఇదే మొదటిసారి. ప్రమాదం గూర్చి అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించింది. ఈ నిపుణుల కమిటీ గురువారం పాశమైలారం సిగాచి ఘటనా స్థలికి చేరుకుంది.

కార్మికుల భద్రతకు యాజమాన్యం నిబంధనలు పాటించిందా అని కమిటీ అధ్యయనం చేస్తోంది. కమిటీ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనుంది.

సిగాచి కంపెనీ వినియోగించే మిషన్ పాతది కావడంతో బ్లాస్ట్ జరిగినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని యాజమానం కొట్టి వేసింది. మిషన్ పాతది కాదు భవనమే పాతది యాజమాన్యం చెబుతోంది.

నిజా నిజాలను నిగ్గు తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ప్రభు త్వం నియమించిన కమిటీకి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటీ)ఎమెరిటస్ సైంటిస్ట్ డాక్టర్ బి. వెంకటేశ్వరరావు చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ . ప్రతాప్ కుమార్, చెన్నయ్ లోని లెదర్ సెంట్రల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ సూర్యనారాయణ, పూణెలోని నేషనల్ కెమికల్ ల్యాబ్ భద్రతాధికారి డాక్టర్ సంతోష్ గుగే సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ పాశమైలారం ఘటనపై విచారణ చేయడంతో బాటు మున్ముందు ప్రమాదాల నివారణకు కోసం సూచన చేస్తూ నివేదిక సమర్పించనుంది.


Read More
Next Story