యువతి ఆత్మహత్య.. ప్రియుడి మీదే అనుమానం
x

యువతి ఆత్మహత్య.. ప్రియుడి మీదే అనుమానం

సంగారెడ్డ జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు యువతి మృతదేహంతో కుటుంబీకుల ఆందోళన.


తమ కూతురు మరణానికి ప్రియుడే కారణం అంటూ యువతి మృతదేహంతో కుటుంబ సభ్యులు యువకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం మాణిక్‌నాయక్ తండాలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే తమ కూతురుని హత్య చేసి.. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని యువతి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

విఠల్ నాయక్ తండాకు చెందిన వడితే కావేరి(23), నిజాంపేట్ మండలంలోని మాణిక్ నాయక్ తంాకు చెందిన సభావత్ శ్రీకాంత్.. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇరువురు తమ కుటుంబాలకు చెప్పారు. కాగా వారు పెళ్ళికి నిరాకరించడంతో శ్రీకాంత్, కావేరి సొంత గ్రామాలను విడిచి హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లో సహజీవనం ప్రారంభించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కావేరి.. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు.. తమ కూతరును శ్రీకాంత్‌యే హత్య చేశాడని ఆరోపించారు. అదే ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలసులు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే కావేరి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్తున్న సమయంలోనే శ్రీకాంత్ ఇంటి ముందు ఉంచి.. కావేరి కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదర్చడం కోసం పెద్దమనుషులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Read More
Next Story