
రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మరణం
బిటెక్ విద్యార్థిని మైత్రి లారీ చక్రాల క్రింద కొనఊపిరితో..
షాద్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి మశ్చేందర్, కూతురు మైత్రి దుర్మరణం చెందారు. బైక్ పై వీరిద్దరు షాద్ నగర్ చౌరస్తాకు చేరుకాగానే అదుపు తప్పిన వాటర్ ట్యాంక్ బైక్ ను గుద్దేసింది. స్పాట్ లోనే తండ్రి, కూతురు చనిపోయారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని పంచనామా చేసి మృతదేహాలను షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా నీళ్ల ట్యాంకర్ నడిపిన డ్రైవర్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
శంషాబాద్ వర్దమాన్ కాలేజిలో బీటెక్ చదువుతున్న తన కుమార్తెను కాలేజిలో దింపడానికి మశ్చేందర్ బస్టాప్ కు వెళుతున్న సమయంలో ప్రమాదం సంభవించింది. లారీ గుద్దడంతో మశ్చేందర్ అక్కడికక్కడే చనిపోగా కూతురు మైత్రి లారీ టైర్ల క్రింద ఇరుక్కుని ప్రాణాలతో కొట్టుమిట్టాడింది. స్థానికులు ఆమెను లారీ చక్రాల క్రింద నుంచి పైకి తీసుకొచ్చారు. అప్పటికే తీవ్ర రక్త స్రావం అయిన మైత్రి చనిపోయింది.
ప్రమాదం జరిగినప్పుడు స్పృహలోనే ఉన్న మైత్రి లారీ చక్రాల క్రిందే ఉండి ‘‘నన్ను కాపాడండి నన్ను కాపాడండి’’అంటూ ప్రాధేయపడినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. తన ఫోన్ ఆన్ చేసి కుటుంబసభ్యులకు సమాచారం చేరేవేయమని మైత్రి ప్రాధేయపడింది. ఇంతలో మైత్రికి ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. లిప్ట్ చేయలేని స్థితిలో ఉన్న మైత్రి ఫోన్ తీసుకుని స్థానికులు మాట్లాడారు. ప్రమాదం జరిగిన విషయాన్ని చెప్పారు. ఉదయం షాద్ నగర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదం మశ్చేందర్ కుటుంబంలో విషాదం నింపింది. బీటెక్ చదువుతున్న మైత్రి చనిపోవడం ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది.