పెళ్ళిలో మటన్ ముక్క లొల్లి
x

పెళ్ళిలో మటన్ ముక్క లొల్లి

ఇటీవల చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన బలగం సినిమా స్టోరీ అందరికీ గుర్తుండే ఉంటుంది.


ఇటీవల చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన బలగం సినిమా స్టోరీ అందరికీ గుర్తుండే ఉంటుంది. నల్లి బొక్క దగ్గర మొదలైన గొడవ ఆడపడుచుని తన పుట్టింటికి కొన్నేళ్లపాటు దూరం చేస్తుంది. తండ్రి మరణానంతరమే ఆమె పుట్టింటికి వస్తుంది. ఈగో ప్రాబ్లెమ్ తో మొదలైన ఈ గొడవ ముసలాయన మరణం తర్వాత సమసిపోతుంది. కుటుంబం ముక్కలవ్వడానికి కారణం 'ముక్క' తెచ్చిపెట్టిన ఈగో సమస్య.

నిజ జీవితంలో కూడా ఈ మటన్ ముక్క తెచ్చే గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పెళ్ళింట్లో. తెలంగాణలో సహజంగా అమ్మాయి ఇంటి దగ్గర పెళ్ళి తంతు జరుగుతుంది. చాలా పెళ్ళిళ్ళలో భోజనల్లో చికెన్, మటన్ కంపల్సరీ. వడ్డించేటోడు మనోడైతే ఒక ముక్క ఎక్కువ పడుతుంది. లేదంటే గొడవ అవుతుంది. ఈ సామెత దగ్గరగా సరిపోతుంది గురువారం నిజామాబాద్ లో జరిగిన ఘటన. ఈ గొడవలో వధూవరుల బంధువుల్లో ఎనిమిది మందికి పైగా గాయాలపాలయ్యారు.

స్థానిక వివరాల ప్రకారం... నవీపేటలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం మండల కేంద్రానికి చెందిన వధువుకు నందిపేట మండలంలోని బాద్గుణకు చెందిన వరుడితో పెళ్లి జరిగింది. పెళ్లిలో ఏర్పాటు చేసిన భోజనాల్లో పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారని కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో ఫంక్షన్ హాల్ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడినవారిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read More
Next Story